యూట్యూబ్ లో దూసుకుపోతున్న వినయ విధేయ రామ టీజర్ !

0
250
రంగస్థలం సినిమా భారీ విజయం తరువాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీనివాస్ దర్శకత్వంలో రాబోతున్న కొత్త సినిమా వినయ విధేయ రామ. కొన్ని నెలల క్రితం షూటింగ్ మొదలెట్టిన ఈ సినిమా తాలూకు ఫస్ట్ లుక్ ని మొన్న విడుదల చేసారు చిత్ర యూనిట్ సభ్యులు. నిజానికి ఈ సినిమా టైటిల్ పై కొద్దిరోజులనుండి సోషల్ మీడియాలో విపరీతంగా చర్చ జరిగింది. అయితే ఎట్టకేలకు సినిమా టైటిల్ ని ఫిక్స్ చేసి, సోషల్ మీడియా వేదికల్లో పోస్ట్ చేశారు డివివి ఎంటెర్టైన్మెంట్స్ వారు.
ఇకపోతే ఈ సినిమాలో చరణ్ సరసన భరత్ అనే నేను ఫేమ్ కైరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ప్రస్తుతం విడుదలైన ఈ సినిమా టీజర్ యూట్యూబ్ లో దుమ్మురేపుతోంది అనే చెప్పాలి. ఇక టీజర్ లో ఎవరినైనా  భయపెట్టాలంటే, ఒక పది నిమిషాలు, అదే చంపేయాలంటే పదిహేను నిమిషాలు చాలు అని చరణ్ చెప్పిన డైలాగు చాలాబాగుంది. ఇక ఎన్నో ఆశలు పెట్టుకున్న మెగాభిమానులు టీజర్ విడుదలవగానే సోషల్ మీడియా వేదికల్లో విపరీతమైన ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. యువ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి రిషి పంజాబీ, ఆర్ధర్ ఏ విల్సన్ ఫోటోగ్రఫీ అందిస్తుండగా, ఎం రత్నం మాటలు సమకూరుస్తున్నారు. కాగా ఈ సినిమా రాబోయే సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here