రామ్ చరణ్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన అల్లు అర్జున్!

0
108
మెగా ఫ్యామిలిలో, మరియు వారి అభిమానుల్లో ఆమధ్య అల్లు అర్జున్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై చేసిన వ్యాఖ్యలు ఎంతటి కలకలం రేపాయో అందరికి తెలిసిందే. ఒక ఆడియో వేడుకలో మిగిలిన అందరూ మెగా హీరోల గురించి మాట్లాడిన బన్నీ, పవన్ గురించి కూడా చెప్పాలని మెగా అభిమానులు అరవడంతో చెప్పను బ్రదర్ అని అనడం, అక్కడినుండి చాలా రోజులపాటు అదే మాట సోషల్ మీడియా వేదికల్లో సంచలనంగా మారడం అందరికి తెలిసిన విషయం. అప్పటినుండి బన్నీ ఫ్యాన్స్ మరియు పవన్ ఫ్యాన్స్ ఒకరి పై మరొకరు సోషల్ మీడియాల్లో మాటాల తూటాలతో గొడవపడ్డ ఘటనలు అనేకం వున్నాయి. అయితే ప్రస్తుతం మరొక్కసారి బన్నీ వ్యాఖ్యలు మెగా అభిమానుల్లో కొంత గందరగోళానికి గురిచేస్తున్నాయి. మ్యాటర్ ఏంటంటే, బాహుబలి విజయం తరువాత రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలు గా రాజమౌళి ఒక భారీ మల్టి స్టారర్ ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా ప్రారంభోత్సవం మొన్న 11వ తేదీన ఎంతో ఘనంగా కొందరు ప్రత్యేక అతిథుల మధ్య జరిగింది.
ఇక ఈ వేడుకపై అల్లు అర్జున్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం టాలీవుడ్ లో వైరల్ గా మారాయి. తనకు ఎంతో ఇష్టమైన రామ్ చరణ్ గారు, రాజా మౌళి గారు, మా బావ తారక్ ఇలా అందరూ కలిసి ఇంత పెద్ద ప్రాజెక్ట్ చేయడం తనకు చాలా ఆనందంగా ఉందని, అంతేకాదు ఆ సినిమా మంచి విజయాన్ని అందుకోవాలని తాను కోరుకుంటున్నట్లు తెలిపాడు బన్నీ. ఇక బన్నీ మాటల్లో చరణ్ ని గారు అనడం, ఎన్టీఆర్ ని బావ అనడంపై కొందరు మెగాభిమానులు విభేదిస్తున్నారు. ఇంట్లోని బావను ఏదో బయటివ్యక్తిలా గారు అనడం ఏంటి అని కొందరు విమర్శిస్తుంటే, మరికొందరు మాత్రం బన్నీ కి మొదటి నుండి రామ్ చరణ్ అంటే ప్రత్యేక గౌరవం కనుక అలా అన్నాడని అంటున్నారు.