రూ.11 లక్షల బైక్ కొన్న బిచ్చగాడు, మ్యాటర్ తెలిస్తే షాక్ అవుతారు!

0
314
మనం నిత్యజీవితంలో ఎందరినో చూస్తూ ఉంటాం, కలుస్తుంటాం. అందులో కొందరు చూడటానికి ఎంతో అందంగా వుంటారు, మరికొందరు పర్వాలేదనిపించేలా ఉంటే మరికొందరు అందవిహీనంగా కూడా వుంటారు. అయితే ఒకరి రూపురేఖలను బట్టి వారి మనస్తత్వాన్ని, మరియు వ్యక్తిత్వాన్ని చెప్పలేము అనేది మాత్రం నమ్మకతప్పని నిజం. ఇక బిచ్చగాళ్ళలో కూడా కొందరు డబ్బు కూడబెట్టి తమ స్థాయికి మించిన వస్తువులను కొనుగోలు చేసిన ఘటనలు మనం అక్కడక్కడా విన్నాం. ఇక మనం ఇప్పుడు చెప్పుకోబోయేది కూడా అచ్చం ఇటువంటి ఘటనే. బ్యాంకాక్ లోని ఒక నగరంలో నిత్యం బిచ్చమెత్తుకుని జీవనం సాగించే ఒక ముసలాయన వున్నాడు. అతను ఒకరోజు అనుకోకుండా ఆ నగరంలోని ఖరీదైన మోటార్ బైకులు అమ్మే షోరూమ్ కి వెళ్లి అక్కడ వరుసగా నిలబెట్టబడి వున్న రకరకాల మోటార్ బైక్స్ ని చూస్తూ, వాటిపై ఎక్కి పరిశీలిస్తూ వున్నాడు. అతడిని, మరియు అయన చిరిగిన దుస్తులను చూసిన ఆ షోరూం సిబ్బంది, ఇక్కడ నీకేమి పని, ఇక్కడినుండి బయటకు వెళ్ళు అంటూ బయటకు పంపించారు.
తరువాత పక్కనే వున్న మరొక బైక్ షోరూంకి వెళ్లిన ఆ ముసలాయన అక్కడి బైక్ లను కూడా ఎక్కి పరిశీలించ సాగాడు. దానిని మొదటి షాప్ సిబ్బంది గమనిస్తూ వున్నారు. ఇక ఆ షాప్ వారు కూడా ఆయనని చూసి బయటకు వెళ్లమంటూ పంపించారు. ఇక అక్కడినుండి ప్రక్కనే వున్న మరొక షోరూమ్ కి వెళ్లిన ముసలాయన, అక్కడి బైక్ లను కూడా తీక్షణంగా పరిశీలించసాగాడు. దాన్ని కూడా మొదటి షాప్ వారు గమనిస్తూ వున్నారు. ఇక ఆ షాప్ సిబ్బంది కూడా ముసలాయనని ఏమి కావాలి అంటూ బైక్ లు పరిశీలిస్తున్న అతన్ని మెల్లగా బయటకు పంపారు. ఇక దాదాపుగా ఒక నిమిషం షోరూం బయట నిలబడి ఆలోచించిన ముసలాయన, ఒక్కసారిగా మొదటి షాప్ లోకి వచ్చి, తాను చూసిన బైకుల్లో ఒకదానిపై ఎక్కి దాన్ని పరిశీలించాడు. అది గమనించిన సిబ్బంది ఒక్కసారిగా ఆయన్ను చుట్టుముట్టి, అతన్ని వారించ సాగారు. వెంటనే ఆ ముసలాయన మీ మేనేజర్ ఎక్కడ వున్నారో పిలవండి, అయనతో మాట్లాడాలి అనగానే, మేనేజరు నీకెందుకు, ఆయనతో నీకేం పని వుంది అని అడిగారట.
నాకు ఆ బైక్ నచ్చింది, నేను దానిని కొనాలనుకుంటున్నాను, ధర విషయం మాట్లాడాలి అనగానే. ఓయ్ పెద్దాయన, ఆ బైక్ ధర ఎంతో తెలుసా నీకు, అది వింటే నీకు గుండెనొప్పి వస్తుంది, వెంటనే ఇక్కడినుండి వెళ్ళు అంటుండగా, అక్కడికి వచ్చిన మేనేజర్ ఏంటి గొడవ అని అడిగాడట. ఇక ఆ ముసలాయన నాకు ఈ బైక్ కావాలి ధర చెప్పమనడంతో, దాని ఖరీదు రూ. 11 లక్షలు అన్నవెంటనే, తన జేబునుండి ఆ డబ్బును తీసి ఇచ్చి, వెంటనే ఇది నా పేరున రిజిస్టర్ చేయించండి అన్నాడట. ఆ ఘటనను చూసిన షోరూం సిబ్బంది ఒక్కసారిగా నిర్ఘాంతపోయి, సారీ సర్ మిమ్మల్ని తప్పుగా అర్ధం చేసుకున్నాం మమ్మల్ని క్షమించండి అంటూ ఆయన్ను సాదరంగా ఆహ్వానించి కూర్చోబెట్టారట. దీన్నిబట్టి గతంలో ఒక ఇంగ్లీష్ రచయిత ‘డోంట్ జడ్జ్ ఏ బుక్ బై ఇట్స్ కవర్’ అని చెప్పినట్లుగా మన కంటికి కనిపించిన వారిని మనఇష్టం వచ్చినట్లు అర్ధం చేసుకోవడం తప్పు అని గ్రహించాలి.. మరి దీనిపై మీరేమంటారో మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here