రెండవ పెళ్లి చేసుకోబోతున్న దిల్ రాజు…షాక్ లో టాలీవుడ్!

0
235
ఒకప్పుడు సూపర్ హిట్ సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రెస్ గా మారిన ప్రముఖ నిర్మాత దిల్ రాజు, ప్రస్తుతం మాత్రం కొంత గడ్డు కాలాన్ని ఎదుర్కొంటున్నారు అనే చెప్పాలి. మొదట ఒక్కడు, తొలిప్రేమ, రాజకుమారుడు, స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాలకు డిస్ట్రిబ్యూటర్ గా పనిచేసిన రాజు, గిరి ఇద్దరూ కలిసి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అనే బ్యానర్ పెట్టి, ఆ బ్యానర్ పై తొలి సినిమాగా అప్పటికే ఆదితో సూపర్ హిట్ కొట్టిన వివి వినాయక్ ని దర్శకుడిగా తీసుకుని, నితిన్ హీరోగా దిల్ అనే సినిమాని తీశారు. అయితే అనుకున్న విధంగా అప్పట్లో ఆ సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో వారిద్దరికీ మంచి పేరు వచ్చింది. ఆపై కొన్నాళ్ల తరువాత రాజు, గిరి ఇద్దరు విడిపోయి ఎవరికి వారు సొంత బ్యానర్లు పెట్టుకున్నారు. ఇక అదే శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై తమ్ముడు శిరీష్ తో కలిసి ప్రస్తుతం రాజు నిర్మాతలుగా సినిమాలు నిర్మిస్తున్నారు. తొలి సినిమా మంచి విజయవంతం అవడంతో ఆయనకు దిల్ రాజు అనే పేరు వచ్చింది.
ఇకపోతే రాజు అసలు పేరు వెంకటరమణ రెడ్డి, నిజామాబాద్ నర్సింగపల్లి కి చెందిన రాజు 1970, డిసెంబర్ 18న జన్మించారు. ఆయనకు కొంత యుక్త వయసులోనే తన బంధువుల అమ్మాయయిన అనితతో వివాహం జరిగింది. ఆయనకు ఒక కుమార్తె, పేరు హన్షిత. కాగా ఇటీవల ఆమెకు వివాహం కూడా జరిగింది. ఇకపోతే కొన్నాళ్ల క్రితం అయన భార్య అనిత ఒక దీర్ఘకాలిక వ్యాధితో హఠాన్మరణం చెందారు. అయితే రాజు అప్పటినుండి కొంత మానసికంగా కొంత కృంగిపోయారని, అందుకే సినిమాలపై కూడా పెద్దగా దృష్టిపెట్టలేకపోతున్నారని అయన సన్నిహితులు చెపుతున్నారు. ఇక ప్రస్తుతం కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం రాజు త్వరలో మరొక పెళ్లి చేసుకోబోతున్నారట. అయితే నిజానికి ఆయనకు రెండవ పెళ్లి చేసుకోవడం అసలు ఇష్టం లేదని, కాకపోతే అనిత మరణంతో కొంత కృంగిపోయిన రాజుకు కాస్త ఊరటగా ఉండాలంటే, తన బాధను పంచుకునేవారు ఒకరు ఉండాలని,
అంతేకాక భార్య మరణం తరువాత రాజు సరిగ్గా సమయానికి భోజనం కూడా చేయడంలేదని, ఇక పెళ్లి చేసుకుంటే భార్య తోడుగా ఎప్పుడూ అయన ప్రక్కనే ఉంటూ ,ఆయనకు సంబందించినవన్నీ చూసుకుంటుంది కనుక, ఇకనైనా తన అమ్మని మర్చిపోయి మరొక పెళ్లి చేసుకోమని కూతురు హర్షిత కూడా చెపుతోందట. మరోవైపు అయన బంధువులు కూడా ఆయనను మరొక పెళ్లి  చేసుకోవాలంటూ గట్టిగా పట్టు పడుతున్నారట. అయితే ప్రస్తుతం టాలీవుడ్ వర్గాల్లో వైరల్ గా మారిన ఈ వార్తలో నిజం ఎంతవరకు ఉందొ తెలియాలంటే మాత్రం మరికొద్దిరోజులు ఆగవలసిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here