రోజాకు షాకిచ్చిన రోజా కూతురు…. మ్యాటర్ తెలిస్తే ఆశ్చర్యపోతారు!

0
438
ప్రస్తుతం రాజకీయాల్లో మంచి ఫైర్ బ్రాండ్ పేరుతో దూసుకెళ్తున్న వైసిపి ఎమ్యెల్యే ఆర్కె రోజా, ఒకప్పుడు రాజకీయ రంగ ప్రవేశం టిడిపి తోనే చేసింది. ఇక ఆమె తొలి జీవితం సినిమాల్లో సాగిందనే విషయం తెలిసిందే. మొదట తమిళ సినిమాల్లో నటించిన రోజా, ఆ తరువాత తెలుగు సినిమాల్లో నటించి హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమె భర్త సెల్వమణి సినీ దర్శకుడు. ఇక రోజా దంపతులకు ఒక కుమారుడు మరియు ఒక కుమార్తె. ప్రస్తుతం వారిద్దరూ ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారు. ప్రస్తుతం చిత్తూర్ జిల్లాలోని నగరి నియోజక వర్గానికి ఎమ్యెల్యేగా వున్న రోజా అక్కడ ప్రజల మన్ననలతో రాబోయే రోజుల్లో కూడా అక్కడినుండి పోటీ చేసేలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక రోజా పిల్లలు ఇద్దరూ ఇంట్లో మంచి చలాకీగా ఉంటారని, అంతే కాదు వీక్ ఎండ్స్ లో వారి ఫ్యామిలీ మొత్తం ఎక్కడికైనా వెకేషన్ కి కానీ సినిమాలకు వెళ్తుంటారని ఆమె సన్నిహితులు చెపుతున్నారు.
ఇకపోతే ప్రస్తుతం కొందరు ఆమె సన్నిహితుల నుండి అందుతున్న సమాచారం ప్రకారం, రోజా కూతురు సినిమాలపై ఎంతో ఆసక్తి చూపుతోందని, అందుకే ఇటీవల తన చదువులో కూడా చాల వెనుకబడిందని అంటున్నారు. ఈ జెనరేషన్ లో పిల్లలు ఎంతో స్పీడ్ గా ముందుకు దూసుకువెళ్తున్నారని, అలానే రోజా కూతురు కూడా సినిమాల ప్రభావంతో చదువుపై శ్రద్ధ తగ్గించి సినిమాల్లో చేరాలని, హీరోయిన్ అవ్వాలని అనుకుంటున్నట్లు తల్లితండ్రులకు చెప్పిందట. అయితే తనను ప్రస్తుతం చదువుపై శ్రద్ధ పెట్టమని, చదువులో మంచి పేరు సంపాదించి ముందుకు సాగితే, యుక్త వయసు వచ్చాక సినిమాల్లోకి వెళ్లే విషయం ఆలోచిస్తామని రోజా దంపతలు ఆ అమ్మాయికి చెప్పారట. ఎంతైనా సినిమా నేపథ్యం గల అమ్మాయి కాబట్టి రోజా కూతురు హీరోయిన్ అవుతాను అనడం తప్పు కాదని, కానీ ప్రస్తుతం చిన్న వయసు కనుక, చదువుపై దృష్టి పెట్టాలని వారు సూచిస్తున్నారు. కాగా ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియా వేదికల్లో వైరల్ గా మరి సంచలనం సృష్టిస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here