Home వైరల్ లీకైన ప్రభాస్ సీక్రెట్ బర్త్ డే పార్టీ వీడియో… చూస్తే ఆశ్చర్యపోతారు!

లీకైన ప్రభాస్ సీక్రెట్ బర్త్ డే పార్టీ వీడియో… చూస్తే ఆశ్చర్యపోతారు!

0
291

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ క్రేజ్ మరియు మార్కెట్ బాహుబలి సినిమాతో ఒక్కసారిగా జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయికి ఎగబాకింది అనే చెప్పుకోవాలి. ఆ సినిమా విజయంతో ఎందరో అభిమానులపాలిటి దైవంగా మారిపోయారు ప్రభాస్. ప్రస్తుతం ఇండియాలోని మోస్ట్ వాంటెడ్ హీరోస్ లో ప్రభాస్ కూడా ఒకరు అనే చెప్పక తప్పదు. ఆయన సై అంటే చాలు, ఆయనతో కోట్లాది రూపాయలు పెట్టుబడి పెట్టి సినిమా తీస్తాం అంటూ ఎందరో నిర్మాతలు ఇప్పటికే సిద్ధంగా వున్నారు. కానీ అయన ఎటువంటి భేషిజాలకు పోకుండా, ఇదివరకెప్పుడో ఇచ్చిన మాట ప్రకారం తన ఫ్రెండ్ సుజిత్ కి బాహుబలి తరువాత సాహో సినిమాకి అవకాశం ఇచ్చి తన గొప్ప మనసు చాటుకున్నారు. ఇక అనంతరం జిల్ ఫేమ్ రాధా కృష్ణ తో కూడా ఒక సినిమా చేయనున్నారు ప్రభాస్. ఇక నిన్న తన 39వ బర్త్ డే ని జరుపుకున్న ప్రభాస్, తన అభిమానులకు సాహూ మేకింగ్ టీజర్ ని బర్త్ డే కానుకగా ఇచ్చి అందరిని ఆశ్చర్య పరిచారు.

ఆ టీజర్ చూస్తుంటే అచ్చం హాలీవుడ్ మూవీ ని తలపిస్తోందని, టీజరే ఇలా ఉంటే, ఇంక సినిమా ఎలా ఉంటుందో అని ప్రభాస్ ఫ్యాన్స్ ఇప్పటినుండే కలలు కంటున్నారు. ఇకపోతే నిన్న బర్త్ డే సందర్భంగా హైదరాబాద్ లోని ప్రభాస్ ఇంటివద్దకు అయన అభిమానులు విపరీతంగా చేరుకోవడంతో అక్కడ ఎటువంటి అల్లర్లు జరగకుండా పోలీస్ సెక్యూరిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ప్రభాస్ మాత్రం ఇంటినుండి బయటకు రాకపోవడంతో వారు కొంత నిరాశ చెందారు. నిజానికి ప్రభాస్ నిన్నటి బర్త్ డే పార్టీని తన సహచరులతో చాలా సీక్రెట్ గా ప్లాన్ చేసారని, అందుకే పొద్దున్నే బయటకు వెళ్లిపోయారని తెలుస్తోంది. ఇక తన ఫ్రెండ్స్ తో కలిసి చేసుకున్న పార్టీకి సంబంధించి అయన కేక్ కట్ చేయడం, స్నేహితులతో ఆనందంగా గడిపిన వీడియో నేడు ఇంటర్నెట్ లో విడుదలై సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ వీడియోని చూసిన పలువురు హ్యాపీ బర్త్ డే డార్లింగ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు…. click link for video https://www.youtube.com/watch?v=oYzw6lRkglE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here