వందల సినిమాలు చేసింది కానీ…చివరికి తినడానికి తిండి కూడా లేక దిక్కులేని చావుకు గురైంది!

0
283
సినిమా ఇండస్ట్రీలో తమకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఆలా మెలమెల్లగా ముందుకు దూసుకెళుతూ తాము సంపాదించిన ఆస్తిని కొంతమంది జాగ్రత్త చేసుకుంటే, మరికొందరు మాత్రం అలా వచ్చిన ఆస్తిని నిలుపుకోకుండా చివరికి తినడానికి తిండి, నిలవడానికి నీడ కూడా లేకుండా దీనమైన స్థితిలో మరణించిన వారు వున్నారు. ఇక అలా అన్నీ పోగొట్టుకుని చివరికి చితికి పోయి, ఆ బాధతో మంచం పట్టి మరణించిన వారిలో చిత్తూరు నాగయ్య, సావిత్రి, కాంతారావు, పద్మనాభం వంటి వారు మనకు ఎక్కువగా గుర్తుకువస్తారు. అయితే మనం ఇపుడు చెప్పుకోబోయేది, ఆలా వున్నది మొత్తం పోగొట్టుకుని చివరికి తినడానికి తిండి కూడా లేకుండా మరణించిన అలనాటి నటి గిరిజ గురించి. గిరిజ ఎన్టీఆర్, కె ఆర్ విజయ కాంబినేషన్ లో వచ్చిన పరమానందయ్య శిష్యుల కథ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమయ్యారు. ఆ సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో అప్పట్లో గిరిజను మంచి అవకాశాలే వరించాయి.
Image result for heroine girija
అయితే ఆ క్రమంలో ఆమె సన్యాసి రాజు అనే ఒక బడా నిర్మాతతో పరిచయం ఏర్పడడం, మెల్లగా అది ప్రేమగా మారి ఇద్దరు వివాహం చేసుకోవడం జరిగిందట. అయితే ఆ సమయంలో ఆమె భర్త రాజు, ఎన్టీఆర్ హీరోగా పెట్టి గిరిజకు వున్న ఆస్తినంతా అమ్మి పవిత్ర హృదయాలు అనే సినిమాను నిర్మించారు. ఎన్నో ఆశలతో నిర్మించిన ఆ సినిమా చివరకు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో గిరిజ దంపతులు పూర్తిగా దీన స్థితికి వచ్చేసారు. ఆపై ఆ సినిమా కోసం తాను తాకట్టుపెట్టిన ఆస్తినంతా లాక్కున్న అప్పుల వాళ్ళు, వారిని ఇంటినుండి బయటకు వెళ్లగొట్టడం, ఆ స్థితిని తట్టుకోలేక భర్త హఠాత్తుగామరణించడంతో  పరిస్థితి మరింత దీనంగా మారిందట. అయితే గిరిజకు ఒక కూతురు ఉండేదని, ఆమె పేరు గంగ, అక్కడక్కడా కొన్ని తెలుగు సినిమాల్లో నటించిన గంగ, ఇక్కడ సరైన అవకాశాలు రావడం లేదని మలయాళంలోకి వెళ్లి అక్కడ సలీమా గా పేరు మార్చుకుని సినిమాల్లో నటించిందట.
అయితే మొదటినుండి ఆమెకు గిరిజకు అంత మంచి అనుబంధం ఉండేది కాదని, ఏదో చెన్నై వచ్చి తన తల్లి చూసి వెళ్ళాలి కాబట్టి చూసి వెళ్లేదని, అలా చివరికి కనీసం ఎవరూ పట్టించుకునే వారు కూడా లేక, కొన్నాళ్ళకు డయాబెటిస్ వ్యాధి ఎక్కువ అవడం, ఆ సమయంలో తినడానికి తిండి కూడా లేకపోవడంతో, ఒకానొక రోజు తన ఇంట్లో దారుణమైన స్థితిలో మరణించిందట. ఇక ఈ విషయాన్నీ తెలుసుకున్న కొందరు సినీ ప్రముఖులు ఆమె స్థితిని తెలుసుకుని ఎంతో కలత చెందారట. అంతే మరి ఓడలు బళ్ళు, బళ్ళు ఓడలు అవడం అంటే ఇదేనేమో మరి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here