వరుణ్ తేజ్ పెళ్లిపై చివరికి నోరు విప్పిన నాగబాబు……ఏమన్నాడో తెలిస్తే షాక్ అవుతారు!

0
294
ప్రస్తుతం సెలెబ్రిటీలకు సంబందించిన ఎటువంటి చిన్న విషయమైనా విపరీతంగా వైరల్ గా మారుతోంది. దానికి ప్రధానకారణం నేటి మీడియా. ఎందుకంటే మీడియా సంస్థలు విపరీతంగా పెరగడం, అంతేకాదు ప్రజలు కూడా ఎక్కువగా ఇంటర్నెట్ వినియోగిస్తుండడంతో, ఎటువంటి వార్త అయినా సరే వారికి త్వరితగతిన చేరిపోవడం వెంటవెంటనే జరిగిపోతున్నాయి. ఇకపోతే, కొన్నాళ్ల నుండి టాలీవుడ్ పెద్ద ఫ్యామిలిల్లో ఒకటైన మెగాఫ్యామిలీ లో త్వరలో పెళ్లి వేడుక జరుగబోతున్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. అయితే, అది మరెవరికో కాదు, మెగాబ్రదర్ నాగబాబు సోదరుడు వరుణ్ తేజ్ కు అని వార్తలు పుకారయ్యాయి. కొన్నాళ్లక్రితం పవన్ మాజీ భార్య రేణు దేశాయి తరపు అమ్మాయితో వరుణ్ కు వివాహం నిశ్చయమైందని, అంతేకాదు ఆ అమ్మాయి వారి ఫ్యామిలీలోని వారందరికీ నచ్చిందని కొన్ని మీడియా సంస్థలు ప్రచారం చేసాయి.
అయితే, ఆ వార్తలు నిజంగా కాదని, మేము ఇప్పట్లో వాడికి పెళ్లి చేయదల్చుకోవడం లేదని, ప్రస్తుతం వాడి ధ్యాసంతా సినిమాల మీదనే అని మెగా ఫ్యామిలీ చెప్పుకొచ్చింది. అయితే ఈ విషయమై ఇప్పటికీ పుకార్లు ఆగకపోవడంతో, నాగబాబు కొందరు మీడియా వారిపై విపరీతంగా ఫైర్ అయ్యారట. మాకు ప్రస్తుతం వాడికి పెళ్లి చేసే ఉద్దేశం లేదని చెప్పినప్పటికీ, మా ఇంట్లో పెళ్లి సందడి జరగబోతోంది అంటూ ఇప్పటికీ కొందరు తప్పుడు కథనాలు ప్రసారం చేస్తున్నారని, అయినా మా అబ్బాయికి కానీ, అమ్మాయికి కానీ ఒకవేళ మేము వివాహం నిశ్చయిస్తే ఖచ్చితంగా ఆ విషయాన్ని అందరికీ తెలియపరుస్తాంతప్ప, రహస్యంగా చేయము కదా అని అన్నారట. అసలు మీకు బుద్ధి ఉందా, మీరు మనుషులేనా, ఎందుకు అలా తప్పుడు కథనాలు ప్రసారం చేస్తున్నారు అంటూ మండిపడ్డారట. అయితే నాగబాబు ఈ విధంగా ఆగ్రహించడం ఒకరకంగా మంచిదే అని, లేకపోతే ఇటువంటి తప్పుడు కథనాలు సృష్టించేవారు మరింత మితిమీరిపోతారు అంటూ పలువురు మెగాభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆయనను సమర్థిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here