వరుణ్ తేజ్ పెళ్లి పై మెగాస్టార్ షాకింగ్ కామెంట్స్!

0
288
సినీ నటులకు సంబందించిన ఏ విషయమైనా ప్రస్తుత కాలంలో ఎంతో వేగంగా బయటకు వస్తోంది. నిజానికి ఒకప్పుడు ఒక ఐదో లేక పదో పత్రికలు ఉండేవి. వారి ద్వారా ఎవరైనా నటి లేదా నటుడికి సంబందించిన విషయం ఏదైనా ఉంటే ఆ పత్రికల్లో రావడం వలన అప్పటి ప్రజలకు తెలిసేది. అయితే ఇప్పుడు ఆలా కాదు, విపరీతంగా టెక్నాలజీ పెరగడం, విరివిగా సోషల్ మీడియా మాధ్యమాలు రావడం, మరియు వినియోగించడం, ఇక అన్నిటికంటే ముఖ్యంగా ఇంటర్నెట్ ధరలు పూర్తిగా తగ్గి అందరికి అంబాటులోకి రావడంతో, ఎవరికి వారు తమకు తోచిన విధంగా వార్తలను రకరకాలుగా ప్రచారం చేస్తున్నారు.ఇక టాలీవుడ్ లోని పెద్ద ఫ్యామిలిల్లో ఒకటైన మెగా ఫ్యామిలీలో త్వరలో పెళ్లి సందడి జరుగబోతున్నట్లు రెండు మూడు రోజులుగా కొన్ని మీడియా వర్గాల్లో పుకారు షికారు చేస్తున్నాయి.
అదేమిటంటే, మెగా బ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాడు అని, పెళ్లి కూతురు పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ కి దగ్గరి బంధువని వార్తలు వచ్చాయి. ఇక ఈ పెళ్లి నాగబాబు కుటుంబానికి మరియు చిరంజీవి, పవన్ కళ్యాణ్ లకు కూడా బాగా నచ్చిందని, ఇటీవల అమ్మాయి ఇంటికి వెళ్లిన నాగబాబు కుటుంబీకులకు కూడా అమ్మాయి నచ్చడంతో త్వరలోనే వారిద్దరికీ పెళ్లి చేయాలనీ నిర్ణయించినట్లు సమాచారం. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న అటువంటి వార్తలన్నీ ఒట్టి పుకార్లని, ఇటీవల సినిమాల్లోకి ప్రవేశించి మెల్లగా తన కెరీర్ ని బిల్డప్ చేసుకుంటూ వెళ్తున్న వరుణ్ కు తాము ఇప్పుడే పెళ్లి చేయకూడదని అనుకున్నామని, ఒకవేళ అన్ని కలిసివచ్చి మంచి సంబంధం దొరికితే మాత్రం మీడియా వారికీ మరియు బంధువులు మరియు అభిమానులందరికి తప్పకుండ తెలియచేస్తామని మెగాస్టార్ చిరంజీవి అన్నట్లు తెలుస్తోంది. కావున ఇకపై ఇటువంటి కల్పితాలు పదే పదే సృష్టించి లేనిపోని విధంగా తప్పుగా రాయవద్దని చిరంజీవి మీడియా వారికీ విజ్ఞప్తి చేశారట. మరి దీనిపై మీరేమంటారో మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియచేస్తారు కదూ!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here