వీడియో చూస్తూ సొంతం గా ప్రసవానికి ప్రయత్నం చివరికి ఏం జరిగింది ? Telugugaramchai

0
44

ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో  ప్రభుత్వ ఉద్యోగం సాధించడం కష్ట తరమైన పని. తల్లిదండ్రులను , భార్య, పిల్లలను వదిలేసి చదువుకోవడానికి పట్టణానికి వస్తుంటారు. అయితే ఈ మధ్య కాలం లో అమ్మాయిలు కూడా పోటీ ప్రపంచంలో తమ వంతుగా బాగానే పోటీ పడుతున్నారు. అలా పోటీ పరీక్షలకు సిద్దమవ్వడానికి వచ్చిన ఓ 25 ఏళ్ళ యువతీ ఏం చేసింది , చివరికి ఆమె జీవితం ఏమైంది ఇప్ప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం.


ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లోని గోరఖ్ పూర్ లో ఓ విషాద ఘటన చోటు చేసుకుంది. గోరఖ్ పూర్ సమీపంలోని బహ్రయిచ్ ప్రాంతానికి చెందిన 25 ఏళ్ళ యువతీ గత 4 ఏళ్లుగా పోటీ పరీక్షలకు సిద్దమవుతుంది. ఈ తరుణంలో తన అవసరాల నిమిత్తమో లేక తనకు ఇష్టంతోనో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ క్రమంలో వివాహేతర సంబంధం వలన ఆమె గర్భం దాల్చింది.గర్భం దాల్చిన విషయం ఎవరికి తెలియకూడదని గది లో ఒంటరిగా మొబైల్ ఫోన్ లో వీడియో చూస్తూ ప్రసవానికి  ప్రయత్నించింది. ఇది వికటించడం తో తీవ్ర రక్త స్రావానికి గురై ఆమె తన ప్రాణాలను  కోల్పోయింది. 

ఇటీవలనే ఆమె కొత్త గది ని అద్దెకి తీసుకుంది. ఆదివారం గదిలో నుంచి రక్తం రావడం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఈ వ్యవహారం వెలుగు చూసింది. ఘటన స్థలం లో చేరుకున్న పోలీసులు రక్తపు మడుగులలో పడి ఉన్న పసికందుని మరియు ఆ యువతి మాతృదేహాలను ఆసుపత్రికి తరలించడం జరిగింది . ఆ యువతీ ఎవరితో వివాహేతర సంబంధం పెట్టుకున్నదో తెలియరాలేదని పోలీసులు తెలపడం జరిగింది . పోటీ ప్రపంచంలో ప్రభుత్వ ఉద్యోగానికి సిద్దమవ్వడానికి పట్టణానికి వస్తున్న కొంత మంది యువతీ యువకులు వివాహేతర సంబంధానికి పాల్పడి చివరికి తమ ప్రాణాలను కోల్పోతున్నారు. తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల  జాగ్రత్త వహించడం మేలు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here