శబరిమలలో మహిళల ప్రవేశంపై సుప్రీమ్ సంచలన తీర్పు!

0
202

కోట్లాది మంది భక్తులు ఎంతో నిష్ఠతో పూజించే శబరిమల అయ్యప్ప కోవెలకు ఎన్నోయేళ్ల నుండి మహిళల ప్రవేశం పై నిషేధం కొనసాగుతున్న విషయం అందరికి తెలిసిందే. కేవలం 10 సంవత్సరాల లోపు మరియు 50 సంవత్సరాలు పైబడిన మహిళలకు మాత్రమే అయన ఆలయంలోకి ప్రవేశం ఉంటుంది. అయ్యప్ప ఆలయంలోకి మాకు కూడా ప్రవేశం కల్పించాలి అంటూ పలు మహిళా సంఘాలు మరియు మహిళా నాయకులు ఎప్పటినుండో పలు ఉద్యమాలు చేస్తున్నారు. ఇక కొన్నేళ్ల క్రితం ఈ అంశం విషయమై అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్ట్ లో ఒక పిటీషన్ దాఖలయింది. మహిళల్లో ప్రతి నెలలో జరిగే రుతు స్రావం అనే అంశాన్ని సాకుగా చూపి వారిని అయ్యప్ప కోవెలలోకి ప్రవేశం లేకుండా చేయడం అన్యాయమని,హిందూ దేవతలను పూజించే మనం, అటువంటి దేవతలతో సమానమైన మహిళలను మాత్రం ఆలయం లోనికి ప్రవేశించడం నిషిద్ధం అంటూ వ్యవహరించడం ఎంతవరకు సబబబని న్యాయస్థానంలో కొందరు మహిళా న్యాయవాదులు వాదించారు.

భారత రాజ్యాంగం లోని 14,15,17 ఆర్టికల్స్ ప్రకారం అలా మహిళలను అడ్డుకోవడం చట్ట విరుద్ధమని, దానినిబట్టి తమని కూడా ఆలయంలోకి మిగతావారివలె అనుమతించాలని వారు కోరారు. ఇక నేడు సుప్రీమ్ న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్ర నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల బృందం, కొన్ని దశాబ్దాలుగా సాగుతున్న ఈ కేసుపై ఇక నుండి మహిళలు కూడా శబరిమల అయ్యప్ప కోవెలలోకి ప్రవేశించడానికి అర్హులే అంటూ సంచలన తీర్పు వెల్లడించింది. అయినా మన సమాజములో స్త్రీ, ;పురుషులు ఇద్దరు సమానులేనని, వారి శరీరంలో ప్రకృతి ప్రకారం జరిగే చర్యను సాకుగా చూపి వారిని అడ్డగించడం తగదని అయన ఈ తీర్పుని వెల్లడించారు. ఇక నేటి సుప్రీం తీర్పుతో దేశవ్యాప్తంగా మహిళామణులు సంబరాలు చేసుకుంటున్నారు…..