శరీరంలో అక్కడ పుట్టుమచ్చలుంటే అదృష్టవంతులవుతారు!

0
159
మనిషి జీవితాన్ని ప్రభావితం చేసేవాటిలో మన చేతి గీతాలు, అలానే రాశులు, గ్రహఫలాలు కొంత పాత్ర పోషిస్తాయి అనేది మనలో చాలా మంది నమ్మకం. ఇక మనిషి శరీరంలోని పుట్టుమచ్చలు కూడా మనకు జరిగే మంచి చెడులకు సూచనగా నిలుస్తాయని కొందరు జ్యోతిష్కులు చెపుతున్నారు. ఇక ఎవరికైతే శరీరంలోని పుట్టుమచ్చల మీద వెంట్రుకలు కనుక వుంటాయో, వారు ధనవంతులు, మరియు కీర్తివంతులుగా నిలిచి, మంచి ఖ్యాతిని గడిస్తారట. ఇకపోతే మగవారిలో రెండుకనుబొమ్మల మధ్య పుట్టుమచ్చలు కనుక ఉంటే వారు దీర్ఘాయుష్షుతో జీవిస్తారట. ఇక మగవారి తలలో పుట్టుమచ్చ కనుక ఉన్నట్లయితే వారు గర్వం కలవారుగా ఉండి, ప్రతివిషయాన్ని విమర్శనాత్మకంగా చూస్తారట. అలానే నుదుటి మీద కనుక ఉంటే, మంచి కీర్తి ప్రతిష్టలు లభించి రాజకీయంగా ఎదుగుతారట.
అదే పుట్టుమచ్చ నుదుటికి క్రింద భాగంలో ఉంటే, తమ లక్ష్యాలను సాధించి వారి జీవితంలోని 40వ దశకం దాటగానే మంచి విజయాలతో దూసుకెళ్తారట. ఇక కనుబొమ్మలపై ఉంటే, కష్టపడి పనిచేయాల్సి ఉంటుందని, మరికొందరికి మంచి ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశం కూడా ఉందట. ఇక ముక్కుపై ఉంటే కొందరిలో క్రమశిక్షణ లోపించి, జీవితంలో ముందుకు వెళ్లడం కొంత సమస్య అవుతుందట. మరికొందరికి అయితే, మంచి క్రమశిక్షణ కలవారుగా వుంది, అన్నింటా పద్దతిగా వ్యవహరిస్తుంటారట. ఇక చెవిపై పుట్టుమచ్చ ఉంటే, మంచి దానగుణం గల వ్యక్తిగా ఉండి, సమాజంలో గౌరవంతో కూడిన గుర్తింపు వస్తుందట. పెదాలపై ఉంటే మన బంధువుల వల్ల ఈర్ష్య కలుగుతుందని, అదే బుగ్గపై ఉంటే రాజకీయాల్లో రాణించి, మంచి స్థిరాస్తులను గడిస్తారట. అదే నాలుకపై ఉంటే, మంచి తెలివితేటలు, మరియు విద్యను కలిగి ఉంటారట. అదే గడ్డం పై ఉంటే మగవారైతే కొంత కోపిష్టిగాను, ఆడవారైతే ముక్కుసూటిగా వ్యవహరించేవారిగాను ఉంటారట. సో చూసారుగా ఫ్రెండ్స్, దీన్నిబట్టి మీకు ఎక్కడెక్కడ పుట్టుమచ్చలు ఉన్నాయో వాటి ప్రకారం మీ గురించి తెలుసుకోండి.