శ్రీజ ప్రెగ్నెంట్ అని తెలిసి ఉపాసనకు క్లాస్ పీకిన సురేఖ!

0
156
టాలీవుడ్ లోని పెద్ద ఫ్యామిలీల్లో ఒకటైన మెగా ఫ్యామిలో ఎటువంటి శుభకార్యం జరిగినా ఎంతో అట్టహాసంగా నిర్వహిస్తారు వారి ఫ్యామిలీ మెంబెర్స్. ఇక మెగా ఫ్యామిలీ ఇంట ప్రస్తుతం ఒక శుభవార్త బయటకు వచ్చి మెగాభిమానులను సంతోషపరుస్తోంది. అది ఏమిటంటే, ఇటీవల రెండవ వివాహం చేసుకున్న మెగాస్టార్ చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ త్వరలో తల్లి కాబోతోందట. ఇక ఈ వార్తపై ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు చిరంజీవి గారు తాత కాబోతున్నారు అంటూ అయనకు కంగ్రాట్స్ చెపుతున్నారట. అయితే ఈ విషయంపై చిరంజీవి భార్య సురేఖ రాంచరణ్, ఉపాసన దంపతులకు చిన్నపాటి క్లాస్ పీకినట్లు చెపుతున్నారు. నిజానికి నిన్నగాక మొన్న పెళ్ళైన శ్రీజ త్వరలో బిడ్డకు జన్మనివ్వబోతోంది. మరి మీరు మమ్మల్ని ఎప్పుడు నానమ్మ, తాతయ్యలను చేస్తారు అంటూ అడిగిందట. అయితే నిజానికి చరణ్ దంపతులు తమకు ఇప్పుడే పిల్లలు వద్దు అనుకున్నారట. ఆ విషయం తాను మరియు చరణ్ ఇద్దరం కలిసి ఎంతో అలోచించి తీసుకున్న నిర్ణయమని, చరణ్ కు ప్రస్తుతం కెరీర్ లో ఎక్కువగా మంచి అవకాశాలు వస్తున్నాయి.
అవి నిలుపుకుని, భవిష్యత్తులో మరింత వృద్ధిలోకి రావాలంటే, ప్రస్తుతం పిల్లలు కొంత అడ్డంకి కాకూడదని, అంతేకాదు తనకు కూడా కొన్ని సోషల్ యాక్టివిటీస్ ఉన్నాయని, వాటికీ కూడా తనకు సమయం సరిపోవడం లేదని, కాబట్టి ఇటువంటి సమయంలో పిల్లల్ని కంటే, ఓవైపు మాకు టైం సరిపోక మరోవైపు వారికీ సరైన విధంగా మాప్రేమ దొరక్క ఇబ్బంది పడవలసి వస్తుందని ఆలోచించి, కొన్నాళ్ళు ఆగి బిడ్డలను కనవచ్చని  నిర్ణయించినట్లు చెప్పిందట. అయితే చిరంజీవి, సురేఖ దంపతులు కూడా చరణ్ కు పిల్లలు కావాలని పైకి చెప్పనప్పటికీ, ఎంతైనా మనవడినో లేదా మానవరాలీనో ఎత్తుకుని ఆడించాలని వారికీ ఉంటుంది కదా అని చిరంజీవి సన్నిహితులు కొందరు చరణ్, ఉపాసనలకు చెపుతున్నారట. కాగా ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మరి సంచలనం సృష్టిస్తోంది. మరి మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి …….