శ్రీనివాస్ ని వదిలేయండి జగన్ సంచలన కామెంట్స్ ఎందుకో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే|#YsJagan|GARAM CHAI

0
171

 

ఇటీవల విశాఖపట్నం ఎయిర్ పోర్ట్ లో ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పై శ్రీనివాస్ అనే ఆగంతకుడు కత్తి తో దాడి చేయడంతో ఆ కత్తి అయన భుజానికి గుచ్చుకుని కొద్దిపాటి గాయం అయింది. అయితే వెంటనే నిందితుడిని స్థానిక పోలీసులకు అప్పగించిన ఎయిర్ పోర్ట్ సిబ్బంది, జగన్ కు అక్కడే ప్రధమ చికిత్స అందించారు. అనంతరం విశాఖపట్నం నుండి యధావిధిగా హైదరాబాద్ ఫ్లైట్ లో చేరుకున్న జగన్, ఆపై బంజారాహిల్స్ లోని సిటీ న్యూరో ఆసుపత్రిలో గాయానికి చికిత్స చేయించుకున్నారు. ఇక జగన్ డాక్టర్ల సలహా మేరకు కొద్దిరోజులు రెస్ట్ తీసుకున్న అనంతరం అతిత్వరలోనే తన ప్రజాసంకల్ప యాత్ర చేపట్టనున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే జగన్ పై హత్యాయత్నానికి ఒడిగట్టిన ఆగంతకుడు శ్రీనివాస్, విశాఖ ఎయిర్ పోర్ట్ లోని క్యాంటీన్ లో వెయిటర్ గా పనిచేస్తున్నాడు. సెల్ఫీ నెపంతో జగన్ దగ్గరకు వచ్చి హత్యాయత్నానికి ప్రయత్నించాడు. ఇక శ్రీనివాస్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడినుండి ప్రస్తుతం నిజాలు రాబట్టే పనిలో వున్నారు. అయితే ఘటన జరిగిన రోజునే అతడి జేబులో ఒక 11 పేజీల లేఖను కనుగొన్న పోలీసులు దానిని చూసి ఆశ్చర్యపోయారు.

నిజానికి అతడు జగన్ అభిమాని అని, ఎన్నికలవేళ జగన్ కు సానుభూతి వస్తుందనే ఆయనపై హత్యాప్రయత్నం చేసినట్లు శ్రీనివాస్ వద్ద వున్న లెటర్ లో రాసి వుంది. అయితే వైసిపి నాయకులు మాత్రమ్ శ్రీనివాస్ చేతిరాత వేరని, అటువంటప్పుడు అతడి జేబులో వున్న లేఖను ఎవరు రాశారు, అయినా హత్యాయత్నం చేసిన నిందితుడికి 11 పేజీల అంతపెద్ద లేఖ రాయవలసిన అవసరం ఎందుకువచ్చింది. ఇదంతా టిడిపి కుట్రలో భాగమని వైసిపి వారు ఆరోపిస్తున్నారు. ఇక నిన్నటినుండి శ్రీనివాస్ ఆరోగ్యం బాగోక, కనీసం కదల్లేని స్థితిలో వున్న అతడిని పోలీసులు స్వయంగా మీడియా ముందే మోసుకుని వెళ్లి వ్యానులో ఎక్కించి ఆసుపత్రికి తరలించారు పోలీసులు. ఆ సమయంలో శ్రీనివాస్ తాను సాధారణ ప్రజలతో ఒక మీడియా సమావేశంలో మాట్లాడాలని అనుకుంటున్నానని, అంతేకాదు తన ప్రాణానికి హాని ఉందని అన్నాడు. ఇక నేడు కొన్ని మీడియా వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం అతడిని వదిలేయాలని వైసిపి అధినేత జగన్ ఏపీ ప్రభుత్వాన్ని మరియు సీఎంని కోరినట్లు తెలుస్తోంది.

నిజానికి శ్రీనివాస్ టీడీపీ మనిషి అయినప్పటికీ, తెలిసి తెలియని వయసులో వున్న కుర్రవాడు అని, అతనికి డబ్బు ఆశ కల్పించి వారే ఈ విధంగా చేయించారుతప్ప అతడు కావాలని నేరం చేసివుండడని జగన్ అన్నారట. ఇక శ్రీనివాస్ ని జైలు లో ఎటువంటి చిత్రహింసలు పెట్టవద్దని, మరియు అతనిని క్షమించి వెంటనే విడుదల చేయాలని జగన్ విజ్ఞప్తి చేసినట్లు చెపుతున్నారు. అయితే ప్రస్తుతం సోషల్ మీడియా వేదికల్లో సంచలనంగా మారిన ఈ వార్తలో నిజమెంత ఉందొ తెలియాలంటే మాత్రం జగన్ నుండి అధికారిక ప్రకటన వచ్చేవరకు వేచిచూడవలసిందే…..