షాకిస్తున్న అమర్ అక్బర్ ఆంటోనీ ఫస్ట్ డే కలెక్షన్స్….తెలిస్తే ఆశ్చర్యపోతారు!

0
211

మాస్ మహారాజ రవితేజ హీరోగా, శ్రీను వైట్ల దర్శకత్వంలో వారిద్దరి కాంబినేషన్ లో ఇదివరకు వెంకీ, దుబాయ్ శ్రీను వంటి హిట్ సినిమాలు వచ్చాయి. ఇక మూడోసారి  వారి కాంబినేషన్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన సినిమా అమర్ అక్బర్ ఆంటోనీ. ఈ సినిమా ట్రైలర్ కు అద్భుతమైన స్పందన రావడంతో సినిమాపై అంచనాలు విపరీతంగా పెరిగాయి. ఇక అత్యధిక థియేటర్లలో నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు కొంత మిక్స్డ్  టాక్ వస్తోంది. నిజానికి మొదటి షో రాత్రి దుబాయ్ లో వేయడం జరిగిందని, అక్కడ సినిమా చూసిన వారు సినిమా చాలా బాగుందని తమ అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. ఇన్నాళ్లకు తమ హీరోకి హిట్ బొమ్మ పడిందని, తమ హీరోకి ఇంతటి గొప్ప విజయాన్ని అందించిన శ్రీను గారికి కంగ్రాట్స్ అంటూ రవితేజ ఫాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా చూసిన ప్రేక్షకులు చెపుతున్న వివరాలను బట్టి చూస్తే, సినిమాలో ఫస్ట్ హాఫ్ ని చాలా సాదాసీదాగా నడిచిందని, అయితే సెకండ్ హాఫ్ మాత్రం బాగుందని అంటున్నారు.

ఇక ఫస్ట్ హాఫ్ లో వచ్చే కామెడీ బాగున్నా, అంతగా వర్క్ అవుట్ కాలేదని, అయితే సెకండ్ హాఫ్ కామెడీ మాత్రం బాగా పండిందని అంటున్నారు. ఇక సినిమాలో వచ్చే ఇంటర్వెల్ ఎపిసోడ్ పెద్ద ప్లస్ అని, ఆ సీన్ తరువాత సెకండ్ హాఫ్ పై బాగా ఆసక్తి పెరుగుతుందట. అయితే కాస్త నెమ్మదిగా మొదలైన సెకండ్ హాఫ్, మెల్లగా ప్రేక్షకుడిని సినిమాకు కనెక్ట్ అయ్యేలా చేస్తుందట. ఇక సెకండ్ హాఫ్ లో వచ్చే ఫైట్స్ బాగా ఆకట్టుకుంటాయని,  ప్రీ క్లైమాక్స్ సీన్స్ బాగున్నాయట. అంతేకాదు సినిమాలో వచ్చే  ట్విస్టులు కూడా బాగా పండాయని అంటున్నారు. పాటలు స్క్రీన్ పై అదిరిపోయాయని, ఇక డాన్ బోస్కో సాంగ్ అయితే ఫాన్స్ తో విజిల్స్ వేయిస్తుందని అంటున్నారు. ఇక మూడుపాత్రల్లో రవితేజ నటన, ఇలియానా గ్లామర్, స్టైలిష్ ఫోటోగ్రఫీ, అద్భుతమైన ఎడిటింగ్, థమన్ పవర్ ఫుల్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాని మంచి హిట్ అయ్యేలా చేశాయట. ఇకమొత్తంగా చెప్పాలంటే చాలా రోజుల తరువాత రవితేజ, శ్రీను వైట్ల, ఇలియానాలకు టాలీవుడ్ లో మంచి హిట్ సినిమా అని అంటున్నారు. ఇక ఈ సినిమా మొదటి రోజు కలెక్షన్లు కూడా బాగానే వచ్చినట్లు తెలుస్తోంది. ఇక సినీ విశ్లేషకులు చెపుతున్న వివరాల ప్రకారం వరల్డ్ వైడ్ గా ఈ సినిమాకి ఫస్ట్ డే రూ.15 కోట్లు గ్రాస్ కలెక్షన్లు వచ్చాయని అంటున్నారు. ఇది రవితేజ కెరీర్ లో హైయెస్ట్ ఫస్ట్ డే కలెక్షన్ అట. మరి ఫస్ట్ డే నుండి మంచి టాక్ సంపాదించిన ఈ రాబోయే రోజుల్లో ఎంతమేర కలెక్షన్లు రాబడుతుందో తెలియాలంటే ఇంకొన్నాళ్ళు ఓపికపట్టాల్సిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here