షూటింగ్ లో గాయపడ్డ హీరో రాజశేఖర్, షాక్ లో జీవిత….మ్యాటర్ కోసం ఇది చూడండి!

0
246
కొన్నేళ్ల క్రితం యాంగ్రీయంగ్ మాన్ గా పేరుగాంచి, పలు విజయవంతమైన సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు రాజశేఖర్. ఇక ప్రస్తుతం అయన సినిమాలు చేయడం ఇదివరకు కంటే కొంత తగ్గించారని చెప్పాలి. ఇక కొన్నాళ్లనుండి సరైన హిట్ లేని రాజశేఖర్, ఇటీవల ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో నటించిన గరుడవెగా సినిమాలో నటించారు. అయితే అనూహ్యంగా హిట్ అయిన ఆ సినిమా రాజశేఖర్ కు మంచి పేరు తీసుకువచ్చింది. అయితే ఆ సినిమా హిట్ కాగానే వెంటనే మరొక సినిమా అంగీకరించని రాజశేఖర్, ఇకపై సెలక్టీవ్ గా జాగ్రత్తతోనే సినిమాలు చేస్తాను అని అన్నారు. ఆ తరువాత అనేక కథలు విన్న తరువాత  ఫైనల్ గా కొన్నాళ్ల క్రితం అ! సినిమాతో మంచి పేరు సంపాదించిన ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో కల్కి అనే సినిమాని మొదలెట్టారు రాజశేఖర్. ఈ సినిమాలో రాజశేఖర్ ఒక ఇన్వెస్టిగేటివ్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నట్లు సమాచారం. ఆదా శర్మ, నందిత శ్వేతా హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాని సి కళ్యాణ్ భారీ ఖర్చుతో నిర్మిస్తున్నారు.
ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. అయితే టాలీవుడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం, ఈ సినిమా షూటింగ్ చేస్తున్న సమయంలో ఒక ఫైట్ కి సంబందించిన షాట్ చిత్రీకరిస్తుండగా హీరో రాజశేఖర్ ముఖానికి కొంత గాయమైందని తెలుస్తోంది. వెంటనే ఆయన్ని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారట యూనిట్ సభ్యులు. అయితే ఆయనకు అయింది కేవలం చిన్న గాయమేనని, పెద్దగా ప్రమాదమేమీ లేదని డాక్టర్లు చెప్పారట. ఇక ఈ విషయాన్ని విన్న రాజశేఖర్ భార్య జీవిత కొంత ఆందోళన కు గురై వెంటనే ఆసుపత్రికి వచ్చారని, అయితే డాక్టర్లు పెద్దగా ఏమి కాలేదు అని చెప్పడంతో ఊపిరి పీల్చుకున్నారట. కాగా ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ గా మారి చక్కర్లు కొడుతోంది. ఇక ఈ ఘటనపై కొందరు నెటిజన్లు గెట్ వెల్ సూన్ రాజశేఖర్ గారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here