సమంత ఎంతో బాధతో కన్నీళ్లు పెట్టుకున్న ఘటన తెలిస్తే ఆశ్చర్యపోతారు!

0
277
టాలీవుడ్ చుల్ బులి సమంత రూత్ ప్రభు, ఇటీవల అక్కినేని వారి అబ్బాయి చైతన్యను ప్రేమించి వివాహం చేసుకుని అక్కినేని సమంతగా మారింది. ఇక ప్రస్తుతం వారిద్దరూ తన జీవితాన్ని ఎంతో ఆనందంగా గడుపుతున్నారు. ఇకపోతే ప్రస్తుతం ఆమెకు సంబందించిన ఒక విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మ్యాటర్ ఏంటంటే, సమంత తాను స్థోమత లేని పేద పిల్లలకు తనవంతు సాయం అందించేందుకు ప్రత్యుష పేరుతో ఒక ఫౌండేషన్ నెలకొల్పిన విషయం తెలిసిందే. అయితే ఈ ఫౌండేషన్ ద్వారా ఇప్పటివరకు దాదాపుగా 550 మంది పేద చిన్నారులకు, హార్ట్, లీవర్, కిడ్నీ వంటి  కొన్ని భయంకర వ్యాధులకు చికిత్స చేయించారు.
అయితే ఈ ఫౌండేషన్ నెలకొల్పిన తరువాత వారు సనా అనే చిన్నారికి తమ ఫౌండేషన్ తరపున లీవర్ ట్రాన్స్ ప్లాంటేషన్ చేయించారు. అందుకోసం దాదాపుగా రూ.15 లక్షలకు పైగా విరాళాలు ఎంతో కష్టపడి సేకరించారు. అయితే ఆ ఆపరేషన్ సక్సెస్ అయినప్పటికీ, చిన్నారి మాత్రం కొంత అస్వస్థతకు గురై మరణించిందని నేడు ప్రత్యుష ఫౌండేషన్ తరపున ఒక వాలంటీర్ గా పనిచేస్తున్న శశాంక భినేష్ ట్విట్టర్ ద్వారా ఒక పోస్ట్ పెట్టారు. నిజానికి సనా తల్లితండ్రులది ప్రేమవివాహమని కూలిపనులు చేసుకుంటున్న వారికి, సనా పుట్టిన తరువాత ఆమెకు కాలేయ వ్యాధి రావడంతో, ఆ వ్యాధికి ఆపరేషన్ చేయించే స్థోమతలేక తమకు తెలిసిన వారి ద్వారా ప్రత్యూష ఫండేషన్ ను సంప్రదించారని చెప్పుకొచ్చారు. అయితే సనా ఆపరేషన్ సక్సెస్ అవ్వాలని  సమంతా సహా మేమందరం దేవుణ్ణి ఎంతో ప్రార్ధించామని, అయితే ఆపరేషన్ తరువాత  సనా మరణించిందని ఆవేదనతో పోస్ట్ చేశారు.
అయితే ఆమెకు ఆపరేషన్ జరుగుతున్న రోజే సమంత గారి పుట్టినరోజు అని, ఆ సమయంలో ఆమె ఎన్టీఆర్ తో కలిసి రభస సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నారని చెప్పారు. సనా ఆపరేషన్ కాగానే చనిపోయింది అనే విషయాన్ని తానే షూటింగ్ స్పాట్ లో వున్న సమంతకు ఫోన్ చేసి చెప్పానని, అది విన్న సమంత ఒక్కసారిగా భోరున విలపించారని చెప్పారు శశాంక. అప్పటినుండి సమంత ప్రతిపుట్టినరోజున సనా ని తలుచుకుంటారని, చిల్డ్రన్స్ డే సందర్భంగా సనా ను గుర్తుచేసుకుంటున్నామని, రాబోయే రోజుల్లో తమ ఫౌండేషన్ ద్వారా మరింతమంది చిన్నారులను ఆదుకుంటామని శశాంక చెప్పారు. కాగా ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ గా మారింది. ఈ విషయం తెలుసుకున్న కొందరు నెటిజన్లు సమంత గొప్పతనానికి మెచ్చుకుంటూ ఆమెను అభినందిస్తున్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here