సవ్యసాచి మొదటి రోజు కలెక్షన్లు చూస్తే ఆశ్చర్యపోతారు!

0
152

యువ సామ్రాట్ నాగ చైతన్య హీరోగా నిధి అగర్వాల్ హీరోయిన్ గా కార్తికేయ, ప్రేమమ్, కిరాక్ పార్టీ సినిమాల దర్శకుడు చందూ మొండేటి దర్శకత్వం వహించిన లేటెస్ట్ మూవీ సవ్యసాచి. ఎన్నో అంచనాలతో నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాపై చాలావరకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తున్నట్లు సమాచారం. ఇక ఉదయం బెనిఫిట్ షో చూసిన అక్కినేని ఫాన్స్ ఆనందానికి అవధుల్లేవని, అంతేకాదు ఎన్నాళ్ళనుండో తాము చైతన్య నుండి ఎటువంటి సినిమా కోసం అయితే ఎదురుచూసామో, దర్శకుడు చందూ మొండేటి తమ హీరోకి అటువంటి మూవీ ఇచ్చాడని అంటున్నారు. అంతేకాదు సినిమాలో చైతన్య నటన అదరగొట్టాడని, యాక్షన్ సన్నివేశాల్లో అయితే ఇరగదీశాడని అంటున్నారు. ఇకపోతే సినిమా ఫస్ట్ హాఫ్ లో కామెడీ, లవ్ సీన్స్ బాగున్నాయని సమాచారం. ఇంటర్వెల్ ఎపిసోడ్ అయితే అద్భుతం అని చెపుతున్నారు. ఇక సెకండ్ హాఫ్ లో వచ్చే రెండు యాక్షన్ సన్నివేశాలు, మరియు ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్ సినిమాకి ప్రధాన ఆకర్షణ అట.

ఇక సంగీత దర్శకుడు కీరవాణి సంగీతం, యువరాజ్ అందించిన ఫోటోగ్రఫీ సినిమాకి చాలా హెల్ప్ అయినట్లు తెలుస్తోంది. ఇక దాదాపుగా అన్ని ఏరియాల నుండి మంచి పాజిటివ్ టాక్ సంపాదిస్తున్న ఈ సినిమా, మొదటి రోజు దాదాపు రూ.8 నుండి రూ.10 కోట్లవరకు కలెక్షన్లు రాబట్టినట్లు సినీ విశ్లేషకులు చెపుతున్నారు. నిజానికి ఇది నాగచైతన్య నటించిన అన్ని చిత్రాల్లోకి మొదటి రోజు అత్యధిక కలెక్షన్ అని అంటున్నారు. ఇక సినిమాకి మొదటి షో నుండే పాజిటివ్ టాక్ రావడంతో సినిమా యూనిట్ విపరీతమైన ఆనందాన్ని వ్యక్తం చేస్తోందని, మైత్రి మూవీస్ నిర్మాతలు త్వరలో సినిమా విజయోత్సవ వేడుకని కూడా ఘనంగా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఇక దీన్నిబట్టి చూస్తే సవ్యసాచి సక్సెస్ అటు చైతన్యకి ఇటు అక్కినేని అభిమానులకు మంచి జోష్ నిచ్చిందని మాత్రం అర్ధం అవుతోంది.

Savyasachi Genuine Public Talk|#Savyasachi|#NagaChaitanya|#NidhiAgarwal|#ChanduMondeti|GARAM CHAI

 

Savyasachi Movie Talk Hit Or Flop.?|#Savyasachi|#NagaChaitanya|#Madhavan|#NidhiAgarwal|GARAM CHAI