సాహో టీజర్ చూసి అల్లుఅర్జున్ ఏమన్నాడో తెలిస్తే షాక్ అవుతారు!

0
327
యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా రన్ రాజా రన్ ఫేమ్ సుజిత్ దర్శకత్వంలో రూ.200 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ప్రతిష్టాత్మక సినిమా సాహో. ఇక బాహుబలి 2 సినిమా సమయంలో విడుదల చేసిన ఈ సినిమా ఫస్ట్ లుక్ కి ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందన వచ్చింది. ఇకపోతే నేడు ప్రభాస్ పుట్టిన రోజుని పురస్కరించుకుని యూవీ క్రియేషన్స్ వారు విడుదల చేసిన షేడ్స్ అఫ్ సాహో, పేరుతో ఒక మేకింగ్ టీజర్ విడుదల చేశారు. ఇక ఈ టీజర్ చూసిన ప్రభాస్ అభిమానులు మరియు ప్రేక్షకులు కళ్ళు తిప్పుకోలేకపోతున్నారు. అంత అద్భుతంగా వుంది ఈ టీజర్, దీన్నిబట్టి చూస్తే సినిమా ఎంత భారీ బడ్జెట్ తో రూపొందుతోందో అర్ధం చేసుకోవచ్చు. ఇందులో అబుదాబి లో తీసిన కొన్ని చేజింగ్ సీన్లు తాలూకు మేకింగ్ సన్నివేశాలు పొందుపరిచారు. ఇందులో ఉపయోగించిన బైకులు, కార్లు, ట్రక్కులు చూస్తే నిజంగా మతిపోతుంది.
కాగా ఈ సినిమా యాక్షన్ సన్నివేశాలకు హాలీవుడ్ స్టంట్ మాస్టర్లు పనిచేస్తున్నారు. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధ కపూర్ ప్రభాస్ సరసన జోడిగా నటిస్తుండడం మరొక ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. చెప్పాలంటే ప్రభాస్ ఈ టీజర్ లో చాలా స్టైలిష్ గా మంచి రగ్డ్ లుక్ లో కనపడుతున్నాడు. బాలీవుడ్ సంగీత దర్శకులు శంకర్-ఎహసాన్-లాయ్ సంగీతం అందించగా, మది ఫోటోగ్రఫీ అందిస్తున్నారు. ఈ మేకింగ్ టీజర్ చూస్తుంటే అచ్చం హాలీవుడ్ సినిమాను పోలి ఉందని, నేను కూడా ఒక అభిమానిగా అయన సాహో సినిమా కోసం ఎదురు చూస్తున్నాని, టీజర్ అద్భుతంగా ఉందని, టీజరే ఇలా ఉంటే, ఇక సినిమా ఎలా ఉంటుందో అని అల్లు అర్జున్ ఆశ్చర్యం వ్యక్తం చేసాడట. అంతేకాదు అల్లు అర్జున్ ప్రభాస్ ని విష్ చేస్తూ ట్విట్టర్ లో ఒక పోస్ట్ పెట్టి, మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అంటూ ట్వీట్ చేసారు. దీన్నిబట్టి చూస్తుంటే, కేవలం అభిమానుల్లోనే కాదు, అటు సెలబ్రెటీల్లోనూ ప్రభాస్ కు మంచి ఫాలోయింగ్ ఉందని అర్ధం అవుతోంది…..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here