సుధీర్ ఇంట్లో ఎలావుంటాడో చెప్పి షాకిచ్చిన ఆయన తండ్రి…. చూస్తే ఆశ్చర్యపోతారు!

0
378

ఈటివి లో ఈ దసరాని పురస్కరించుకుని ప్రసారం కానున్న ప్రత్యేక షో సరైనోళ్లు. కాగా ఈ షో కు సంబందించి ఇప్పటికే రెండు ప్రోమోలు విడుదల చేసింది ఆ ప్రోగ్రామ్ యూనిట్. ఇక ఇప్పుడే విడుదల చేసిన రెండవ ప్రోమో, ప్రోగ్రాం పై మరింత హైప్ ని పెంచిందని చెప్పుకోవాలి. మెజీషియన్ గా సుధీర్ చేసిన అద్భుతాలు ఈ ప్రోమోలో నిజంగా చాలా ఆకట్టుకున్నాయి. ఇక సుధీర్ ను పండుగల సమయంలో మాత్రం మిస్ అవుతున్నాం అని అయన తల్లి కొంత ఉగ్వేగంతో మాట్లాడటం, ఆ వెంటనే ఆయన తండ్రి మైక్ తీసుకుని, మావాడు ఇక్కడే కాదు ఇంట్లో కూడా మంచి నాటిబాయ్ అని, నిజానికి అది మా జీన్స్ లోనే ఉందని, నేను కూడా అంతే, నా కాలేజీ డేస్ లో వున్నపుడు తనలానే మంచి జోష్ తో చలాకీగా ఉండేవాడిని అని చెప్తూ, షోలో వారందరితో నవ్వులు పూయించారు.

ఇకపోతే ప్రోమోలో శ్రీముఖి, మంగ్లిలు సుధీర్ మరియు ప్రదీప్ లపై పాడిన పేరడీ పాటలు అక్కడివారందరితో విజిల్స్ వేయించాయి. ఓరోరి సుధీర్ రారా, వీణ్ణి తన్నేవారే లేరా!.. అందరు పొరలు పోరీని చూసి టచ్ మీ అంటుంటే, వీడు పొద్దున్న నుండి రాత్రి వరకు రేష్మి అంటాడే అనే పాట…. లేడీస్ షో అయినా, ఢీ డాన్స్ షో అయినా వాట్ ద వాట్ ద లైఫ్, ఇక ప్రదీప్ కి రాదా వైఫ్ అంటూ పాడుతూ సందడి చేశారు. ఇక ప్రోమోలో రోజా పలికిన బాలకృష్ణ డైలాగులు, శేఖర్ మాస్టర్ చెప్పిన లెజెండ్ మూవీ డైలాగ్స్, అలానే వాళ్లిద్దరూ కలిసి రంగస్థలం సినిమాలోని ఎంత సక్కగున్నావే పాటకు వేసిన డాన్స్ మూమెంట్స్ కూడా ఆకట్టుకుంటున్నాయి. ఇక ఈ ప్రోమోతో, ప్రోగ్రాం పై అంచనాలు మరింత పెరిగాయి. మరి ఈ ప్రోగ్రామ్ ఎంతమేర వీక్షకుల నుండి పాజిటివ్ రెస్పాన్స్ పొంది సక్సెస్ అవుతుందో తెలియాలంటే మాత్రం మరికొద్దిరోజుల్లో వెయిట్ చేయాల్సిందే…..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here