సుధీర్ కు గాయమైందని తెలిసి ఒక్కసారిగా కుప్పకూలిన అతని తండ్రి!

0
319
ప్రస్తుతం ఏదైనా పండుగ వచ్చిందంటే చాలు, టెలివిజన్ ఛానల్స్ వారు పోటాపోటీగా రకరకాల కార్యక్రమాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా త్వరలో రాబోతున్న దీపావళి పండుగను పురస్కరించుకుని ఒక ప్రముఖ టెలివిజన్ ఛానల్ లో ప్రసారం కాబోతున్న ప్రోగ్రాం తరాజువ్వలు. ప్రస్తుతం ఈ షో తాలూకు ప్రోమో యూట్యూబ్ లో విడుదలై విపరీతంగా దూసుకుపోతోంది. ఇకపోతే ఈ ప్రోమో లో సుమ మరియు అలీ జడ్జీలుగా రావడం, ఇక సుడిగాలి సుధీర్, రష్మీ, విష్ణు ప్రియా,శ్రీముఖి లు ఆకట్టుకునే యాంకరింగ్ తో ప్రేక్షకులను ఆకట్టుకోవడం బాగుంది. ఇకపోతే శ్రీముఖి మేల్ మరియు ఫీమేల్ వెర్షన్స్ రెండూ తానే పాడే ఊలాలా ఊలాలా సాంగ్ ప్రేక్షకులను అలరించింది.
అంతేకాక యాంకర్ రవి మగవాళ్ళు కష్టపడి ఇంటికి వస్తే ఆడవాళ్లు మాత్రం ఇంట్లో సుఖపడుతున్నారు అనడంతో, సుమ అందుకుని ఇంట్లో ఆడవాళ్లు ఉదయం లేచిన దగ్గరినుండి తమ పిల్లలు, భర్త, అత్తమామలు ఇలా అందరికి సేవచేస్తూ, చేదోడువాదోడుగా నిలుస్తూ ఉంటారని  ఆడవారే నిజంగా మగవారికంటే గొప్పవారు అని అనడంతో ఒక్కసారిగా షాక్ అయిన అలీ, అక్కడి ఒక వస్తువును తీసి మహానటి అంటూ ఆమెకు దానిని బహుమతిగా అందించడం షోలో విపరీతంగా నవ్వులు పూయిస్తుంది. ఇక షో చివరిలో సుడిగాలి సుధీర్ మరియు విష్ణు ప్రియాలు చేసిన డాన్స్ సూపర్బ్ గా వుంది. వారిద్దరూ ఒంటికి తాళ్లు కట్టుకుని గాల్లో పైకి ఎగురుతూ, కిందకి వస్తూ చేసే వెరైటీ డాన్స్ కి ఫిదా అవుతారు షోలో వారందరూ.
అయితే అనుకోకుండా తాళ్లతో పైకివెళ్ళిన సుధీర్ ఒక్కసారిగా స్పృహ తప్పడంతో అతడిని మెల్లగా క్రిందకు దించిన యూనిట్ సభ్యులు,  ఎంతసేపటికి స్పృహలోకి రాకపోవడంతో అతడిని సమీప ఆసుపత్రికి తరలించారట. ఇక ఆ ఘటన చూసిన రష్మీ, అలీ, సుమ లు ఒక్కసారిగా నిర్ఘాంతపోయారని తెలుస్తోంది. ఇక విషయాన్నీ తెలుసుకున్న సుధీర్ తల్లితండ్రులు కన్నీరుమున్నీరు అవుతున్నారని, ఇక అతని తండ్రి అయితే విపరీతమైన ఆవేదన మరియు టెన్షన్ తో కుప్పకూలిపోయారని, ఆయన్ని పరీక్షించిన డాక్టర్లు ఆయన ఆరోగ్యం బాలేదని చెప్పినట్లు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియా వేదికల్లో వైరల్ గా మారి సంచలనం సృష్టిస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here