సుధీర్, నేను పెళ్లి చేసుకుంటాం… కానీ అంటున్న రేష్మి

0
320
టెలివిజన్ షోలతో మంచి పాపులారిటీ సంపాదించిన యాంకర్ రేష్మి గౌతమ్. తరువాత అక్కడినుండి అడపాద పా కొన్ని సినిమాల్లో కూడా ఆమె నటిస్తూ వస్తోంది. అయితే ఇటీవల జబర్దస్త్ షోతో మరింత పేరు గడించిన రేష్మి, కొన్నాళ్ల క్రితం ఒక షో సందర్భంగా సుడిగాలి సుధీర్ ని పెళ్లి చేసుకున్న వీడియోలో నటించింది. అయితే అది చూసిన ప్రేక్షకులు తనకు, సుధీర్ కు మధ్య ప్రేమ ఉందని, త్వరలోనే వారు నిజంగా పెళ్లి చేసుకోబోతున్నట్లు పలు పుకార్లు షికారు చేశాయి. అయితే ఇప్పటికే పలుమార్లు ఈ విషయమై మా ఇద్దరి మధ్య అటువంటిది ఏమి లేదు అని
రేష్మి, సుధీర్ ఎన్నిసార్లు క్లారిటీ ఇచ్చినా, ఈ పుకార్లు మాత్రం ఆగడం లేదు. అయితే ఈ విషయమై నిన్న ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన రేష్మి, నిజానికి ఆ పెళ్లి వీడియో చూసిన ప్రేక్షకులు మేము పెళ్లి చేసుకుంటాం అని అనుకోవడం తప్పులేదు, వారు అలా ఊహించుకుంటున్నారని, అటువంటిది ఏమి లేదు అని మేము ఎన్ని సార్లు చెప్పినా వాళ్ళు వినడం లేదు అంటూ చెప్పారు. ఆమె మాట్లాడుతూ, నిజానికి తనకు సుధీర్ తో మంచి ఫ్రెండ్ షిప్ వుందని, ఇద్దరం కలిసి ఎన్నో మంచి విషయాలు షేర్ చేసుకుంటాం, అప్పుడపుడు మా పెళ్లిళ్ల గురించి మాట్లాడుకుంటాం అని చెప్పారు.
అయితే ఇటీవల వచ్చిన ఈ పుకార్లకు ఫుల్ స్టాప్ పెట్టాలంటే తన పెళ్లి మరియు సుధీర్ పెళ్లి  ఒకే వేదికపై ప్రక్కప్రక్కనే జరగాలని అనుకుంటున్నట్లు చెప్పారు. ఒకవేళ ఆలా కాకుండా నా పెళ్లి ముందు జరిగితే నేను అతన్ని మోసం చేసానని, లేదా తన పెళ్లి ముందు జరిగినా నేను అతడిని వెనక తిప్పుకుని వదిలేసానని ప్రజలు అనుకుంటారు. అందువల్ల ప్రజల్లోకి అటువంటి తప్పుడు సంకేతాలు వెళ్లడం తనకు ఇష్టం లేదని, అందువల్లనే ఇద్దరి పెళ్లిళ్లు ప్రక్కప్రక్కనే జరిగేలా అనుకుంటున్నట్లు చెప్పుకొచ్చారు. ఇక ఈ రకమైన పెళ్ళికి సుధీర్ కూడా ఓకె చెప్పాడట. మరి సోషల్ మీడియా వేదికల్లో ప్రస్తుతం హాట్ హాట్ గా చక్కర్లు కొడుతున్న ఈ న్యూస్ లో నిజమెంతో తెలియాలంటే మాత్రం వారి నుండి అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here