సౌందర్య ప్రేమిచి పెళ్లిచేసుకోవాలనుకున్న స్టార్ హీరో ఎవరో తెలిస్తే షాక్ అవుతారు!

0
350
సావిత్రి తరువాత దాదాపుగా అంతటి పేరు సంపాదించి, 2004 ఏపీ ఎన్నికల సమయంలో ఒక పార్టీ అభ్యర్థి తరపున ప్రచారంలో పాల్గొనడానికి బయల్దేరి మధ్యలో హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన దివంగత సౌందర్యని మన ప్రేక్షకులు ఎప్పటికీ మరిచిపోలేరని చెప్పాలి. ఇక ఆమె అప్పట్లో పలు తెలుగు, తమిళ, మలయాళ సినిమాల్లో నటించి మంచి పేరు సంపాదించారు సౌందర్య. నిజానికి నందమూరి బాలకృష్ణ ఎప్పటినుండో తీద్దాం అనుకున్న నర్తనశాల సినిమాలో ఒకప్పుడు సావిత్రిగారు వేసిన పంచాలి పాత్రను అయన సౌందర్యంతో వేయించాలని చూసారంటేనే ఆమెకు వున్న పేరును అర్ధం చేసుకోవచ్చు. ఇక ఆమె హఠాన్మరణంతో ఆ సినిమా ఆగిపోయింది. ఇక అసలు మ్యాటర్ ఏంటంటే, సౌందర్య బ్రతికివున్నపుడు ఒక టాలీవుడ్ హీరోతో పెద్ద ప్రేమాయణం నడిపిందని, నిజానికి ఒకానొక సమయంలో వారిద్దరికీ పెళ్లి కూడా జరగవలసిందని అప్పటి మీడియాలో వార్తలు కూడా విపరీతంగా వచ్చాయి. అయితే ఆ హీరో మరెవరో కాదు, విక్టరీ వెంకటేష్, ఆమె వెంకటేష్ తో చాలా విజయవంతమైన సినిమాల్లో నటించారు. నిజానికి ఆమెకు పెళ్ళికాకముందు తన మనసులో వెంకీ ని పెళ్లి చేసుకోవాలని ఉండేదట.
ఆయనతో వరుసగా సినిమాలు చేస్తున్న క్రమంలో, అయన పద్ధతులు, నడవడిక నచ్చిన సౌందర్య, ఆయనకు ఆ విషయం చెప్పిందని, అయితే ఇదివరకే తనకు పెళ్లి అయి ఉండడంతో అందుకు వెంకీ సమ్మతించలేదని సమాచారం. కాగా వెంకటేష్ కి అప్పటికే పెళ్లి అయి పిల్లలు కూడా ఉన్నప్పటికీ, గతంలో సావిత్రి, శ్రీదేవి వంటి అగ్రతారలు ఇదివరకు పెళ్లిఅయిన వ్యక్తులను రెండవ పెళ్లి చేసుకోలేదా, అది ఏ మాత్రం తప్పు కాదు, కాబట్టి మీరు వెంకటేష్ గారిని పెళ్లి చేసుకోవచ్చు అంటూ అప్పట్లో ఆమెకు కొందరు సలహా ఇచ్చారట. కానీ కొంతమేర ఈ విషయమై తన కుటుంబసభ్యులతో ఆలోచన చేసి చర్చించిన సౌందర్య, తప్పనిసరి పరిస్థితుల్లో వెంకీ పై తనకు వున్న ప్రేమను చంపుకుని, ఆ నిర్ణయాన్ని వెనక్కు తీసుకుందట. ఇక ఆ తరువాత తమ పెద్దలు కుదిర్చిన అబ్బాయినే వివాహం చేసుకున్న సౌందర్య, తన మరణసమయంలో గర్భవతి గా వున్నారు. కాగా ఎన్నో ఏళ్ళ తరువాత టాలీవుడ్ మీడియాలో చర్చనీయాంశంగా మారిన ఈ విషయం, సోషల్ మీడియా వేదికల్లో వైరల్ గా మారి చక్కర్లు కొడుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here