స్పెషల్ ఫ్లైట్స్ కలిగిన ఇండియన్ హీరోస్ ఎవరో తెలిస్తే షాక్ అవుతారు!

0
246
మనలో చాలామందికి లైఫ్ లో ఒక్కసారైనా విమానం ఎక్కాలని కోరిక ఉంటుంది. నిజానికి ఈ విషయం బయటకు చెప్పనప్పటికీ, కొందరికి మాత్రం వారి జీవితంలో ఆ కోరిక తీరకుండా అలా మిగిలిపోతుంది. ఇకపోతే ఇండియాలో పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలకు, లేదా కొందరు బడా రాజకీయ నాయకులకు స్పెషల్ ఫ్లైట్స్ వున్న విషయం చాలామందికి తెలిసిన విషయమే. అయితే మరికొందరు ధనవంతులు తమ అవసరాల రీత్యా కూడా ఫ్లైట్లు కొనుకోలు చేస్తుంటారు. ఇకపోతే, అసలు మ్యాటర్ ఏంటంటే, మన దేశంలోని కొందరు బడా హీరోలకు ప్రత్యేకంగా ఫ్లైట్ లు వున్నాయనే విషయం ప్రస్తుతం వైరల్ గా మారింది. ముఖ్యంగా వారిలో బాలీవుడ్ లోని ప్రముఖ హీరోలైన ఖాన్ ల త్రయం షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్ లకు ఎవరికివారికి స్పెషల్ ఫ్లైట్స్ ఉన్నాయని, నిజానికి వారిలో ఎక్కువగా షారుఖ్ తన ఫ్లైట్ ని ఫ్యామిలీ తో కలిసి టూర్ వెళ్లేందుకు వినియోగిస్తుంటారని తెలుస్తోంది.
ఇక అమీర్ ఖాన్ అయితే అవసరమైనపుడు మాత్రం భార్య కిరణ్ తో కలిసి తమ స్పెషల్ ఫ్లైట్ లో విదేశాలకు వెళ్తుంటారట. ఇక సల్మాన్ కూడా అంతేనట, తన అన్నదమ్ములతో కలిసి ఏటా ఒకసారి ఫ్యామిలీ ట్రిప్ వేయడం సల్మాన్ కు అలవాటని అంటున్నారు. ఇక హ్రితిక్ రోషన్, అజయ్ దేవగన్ వంటి వారికి కూడా ఇలాంటి ఫ్లైట్స్ ఉన్నప్పటికీ వారు ఎక్కువగా వినియోగించరని సమాచారం. ఇక అమితాబ్, అనిల్ కపూర్ లు కూడా అవసరమైన పరిధి మేరకే తమ ఛార్టర్డ్ ఫ్లైట్ లను వాడుతుంటారని, ఇటీవల ప్రిన్స్ యువరాజు పెళ్ళికి అమితాబ్ కుటుంబం తమ సొంత ఫ్లైట్ లో వెళ్లినట్లు తెలుస్తోంది.
ఇక తమిళ సూపర్ స్టార్ రజినికాంత్ కు ప్రత్యేకంగా ఫ్లైట్ లేదని, ఆయనకు వాహనాలపై ఎక్కువ మోజు లేకపోవడం వల్లనే అయన ప్రత్యేక ఫ్లైట్ కొనుగోలు చేయలేదని చెపుతున్నారు. ఇక కమల్ కు కూడా స్పెషల్ ఫ్లైట్ ఉందని, ఆయన రాబోయే రోజుల్లో తన పార్టీ కార్యకలాపాల నిమిత్తం పెద్ద నగరాలకు తన స్పెషల్ ఫ్లైట్ లోనే వెళ్లనున్నట్లు సమాచారం. ఇక టాలీవుడ్  ఎవరికి స్పెషల్ ఫ్లైట్స్ లేవని, అయితే మలయాళ స్టార్ మమ్ముట్టీ మాత్రం ప్రత్యేకంగా వున్న విమానం అవసరమైతే తప్ప వాడరని అంటున్నారు. చూసారుగా ఫ్రెండ్స్, మనం ఇప్పుడు చెప్పుకున్న ఈ హీరోలకు ప్రత్యేక విమానాలున్నాయంటే వారికి ఎంత ఆదాయం వస్తుందో, ఎంతటి ఆస్తిపాస్తులు ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here