స్పైడర్ మ్యాన్ డ్రెస్ లో ఆఫీస్ కు వచ్చిన ఎంప్లాయ్.. మ్యాటర్ తెలిస్తే షాక్ అవుతారు!

0
150
మనలో ఎంతోమందికి సినిమాల్లో వచ్చే పాత్రల్లో తమను తాము ఒకసారి చూసుకోవాలని ఉంటుంది. అయితే అది ఎంతవరకు బాగుంటుందో అనే అనుమానం, మరియు భయంతో చలలామంది ఆ కోరికను మనసులోనే దాచుకుంటారు. ఇక మరీ ముఖ్యంగా హాలీవుడ్ సినిమాల్లోని స్పైడర్ మ్యాన్, సూపర్ మ్యాన్, బ్యాట్ మ్యాన్ వంటి పాత్రధారుల వేషాల్లో తమను తాము వూహించుకునేవారు మరికొందరు ఉంటారు. ఇక అటువంటి తన కోరికను తీర్చుకోవాలనుకున్నాడో ఉద్యోగి, కాని అలా వెళ్తే ఉన్నతాధికారుల నుండి ఒత్తిడి వచ్చే అవకాశం ఉంది. అలా ఒత్తిడి భరించడంతో పాటు, అతడు పనిచేసే బ్యాంకులోని ఇతర ఉద్యోగస్తుల నుండి కూడా విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందని భావించి,
రీసెంట్ గా కొత్త జాబ్‌ కి అప్లై చేసి, పాత జాబ్‌కు గుడ్‌ బై చెపుతూ, బ్యాంక్‌లో లాస్ట్‌ వర్కింగ్‌ డేను తనకు అనుకూలంగా మల్చుకునేందుకు ప్రయత్నించాడు.
Image result for employee in spider man dress
తన పాత ఉద్యోగం చివరి రోజును తాను అనుకన్నట్లుగా అంటే స్పైడర్‌ మ్యాన్‌ కాస్ట్యూమ్స్‌లో చేయాలని నిర్ణయించుకున్నాడు. అందకోసం ఎప్పుడో కొని పెట్టుకున్న తన స్పైడర్‌ మ్యాన్‌ కాస్ట్యూమ్స్‌ను ధరించాడు. అచ్చు గుద్దినట్లుగానే స్పైడర్‌ మ్యాన్‌గా ఉన్న ఆ వ్యక్తి బ్యాంకులోకి ఎంట్రీ ఇవ్వగానే అందరు కూడా నోరు వెళ్లబెట్టారు. కొద్ది సేపటికి అందరికి కూడా అతడు తమ సహ ఉద్యోగి అని తెలిసింది. ఇక బ్యాంకుకు వచ్చిన వారిని సర్‌ప్రైజ్‌ చేయడంతో పాటు, ప్రతి ఒక్కరు కూడా అతడిని అభినందించేలా చేశాడు. స్పైడర్‌ మ్యాన్‌ అంటే ఇంత ఇష్టం ఉన్న వ్యక్తి అంటూ అందరు కూడా అతడిని విచిత్రంగా చూశారు. బ్రెజిల్‌లో జరిగిన ఈ సంఘటన ప్రస్తుతం ప్రపంచ మొత్తం వైరల్‌ అవుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here