హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయి ఇంటికెళ్ళగానే తన కూతురు చేసిన పనికి షాకైన జగన్!

0
336
వైసిపి అధినేత జగన్ మోహన్ రెడ్డి పై మొన్న విశాఖపట్నం ఎయిర్ పోర్ట్ లో శ్రీనివాస్ అనే వెయిటర్ చేసిన హత్యాప్రయంత్నం ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే ఈ హత్యాయత్నం సమయంలో ఆగంతకుడు ఉపయోగించిన కత్తి, జగన్ భుజాన్ని తాకడంతో పెద్ద గాయం కాలేదని, ఒకవేళ అయన ఏ మాత్రం ఏమరపాటు వహించినా ఆ కత్తి జగన్ గారి మెడను తాకేదని ప్రత్యక్ష సాక్షులు చెపుతున్నారు. ఇకపోతే జగన్ ఎయిర్ పోర్ట్ లో ప్రధమ చికిత్స తీసుకున్న అనంతరం, హైదరాబాద్ లోని సిటి న్యూరో ఆసుపత్రి వైద్యులు అయన గాయానికి చికిత్స అందించి, మూడురోజులు రెస్ట్ తీసుకోవాలని చెప్పారట. అనంతరం ఆసుపత్రి నుండి ఇంటికి చేరుకున్న జగన్ కు అభిమానులు మరియు కుటుంబ సభ్యులు సాదరంగా ఆహ్వానం పలికారు. ఇక ఇంటికి చేరుకున్న జగన్ ను చూసిన వెంటనే ఆయన పెద్ద కూతురు వర్ష ఒక్కసారిగా కన్నీరు మున్నీరైందట.
అంతేకాదు నాన్నపై హత్యాయత్నం జరిగింది అని తెలియగానే తనకు గుండె ఆగినంత పని అయిందని, నాన్నకు ఏమి కాకూడదని ఆ దేవుడిని ప్రార్ధించానని, నాన్నకు ఏమైందో అని చాలా కలత చెందిందట. అయితే జగన్ కూతుళ్లు మాత్రమే కాదు అయన భార్య భారతి, తల్లి విజయమ్మలు కూడా ఎంతో కంగారుపడిపోయారని తెలుస్తోంది. ఇక జగన్ ను ఇంట్లో చూసిన పలువు వైసిపి నేతలు మరియు కార్యకర్తలు ఎంతో ఆవేదనకు గురయినట్లు సమాచారం. కానీ జగన్ మాత్రం కొంచెం కూడా దిగులు చెందకుండా, వీలైనంత త్వరలో తన ప్రజాసంకల్ప యాత్రను కొనసాగించే ఆలోచనలో వున్నారని తెలుస్తోంది. ఇక ఇప్పటికే జగన్ ను అయన ఇంటివద్ద పలువురు ప్రముఖులు పరామర్శించారని, అయితే ఆయన గురించి అభిమానులు ఎవరూ దిగులుపడవలసిన అవసరం లేదని, వైఎస్ ఆశీస్సులు జగన్ ను ఎప్పుడూ జగన్ వెన్నంటే  ఉండి కాపాడుతాయని వారు చెపుతున్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here