హీరోతో కలిసి ఆ పనిచేస్తూ అడ్డంగా బుక్కైన అనుపమ పరమేశ్వరన్…. షాక్ లో ఆమె తల్లితండ్రులు!

0
329
ఇటీవల సినిమా ఇండస్ట్రీ లో కొందరు హీరోయిన్లు తమ వ్యక్తిగత వ్యవహారాల్లో ఎవరూ తలదూర్చకూడదు అంటూ, తమకు నచ్చిన అబ్బాయిలతో ప్రేమకలాపాలు సాగించడం అక్కడక్కడా చూస్తున్నాం. ఇక ఇటువంటి విషయాలపై వారు పలు విమర్శలు ఎదుర్కొంటున్నారు. అలానే కొందరైతే ఏకంగా ప్రేమ విఫలమై తమ జీవితాన్ని బలిచేసుకున్నవారున్నారు. ఇకపోతే మనం ఇప్పుడు చెప్పుకోబోయేది, టాలీవుడ్ లో ఇప్పుడిప్పుడే మంచి హీరోయిన్ గా పేరు సంపాదించి ముందుకు సాగుతున్న అనుపమ పరమేశ్వరన్ గురించి. ఆమె తెలుగులో అఆ సినిమాతో నితిన్ సరసన టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చారు. ఆ సినిమాలో ఆమె పాత్ర చిన్నదే అయినప్పటికీ, త్రివిక్రమ్ మార్కు డైలాగులతో ఆమె ప్రేక్షకుల్లో మంచి పేరు సంపాదించింది.
ఇకపోతే అక్కడినుండి ఆమెను వరుసగా మంచి అవకాశాలు తలుపుతట్టాయి. అయితే దురదృష్టం ఏమిటంటే, ఆమె శర్వానంద్ తో కలిసి నటించిన శతమానంభవతి తరువాత ఆమెకు ఇప్పటివరకు సరైన సక్సెస్ రాలేదు. ఇక ప్రస్తుతం ఆమెకు సంబందించిన ఒక విషయం టాలీవుడ్లో వైరల్ గా మరి సంచలనం సృష్టిస్తోంది. మ్యాటర్ ఏంటంటే, అనుపమ ఇటీవల హీరో శర్వానంద్ తో కలిసి ఒక రెస్టారెంట్ లో అక్కడి మీడియా కంట పడిందని, అయితే ఆలా వారిద్దరూ కనపడడం ఇది మొదటిసారి  కాదని, దీన్నిబట్టి చూస్తే వారిద్దరిమద్య ఏదో ఉందని కొన్ని మీడియా వర్గాలు అంటున్నాయి. అంతేకాదు శర్వాకు కూడా ప్రస్తుతం ఒకే ఒక సినిమా చేతిలో ఉండడంతో, తనకు షూటింగ్ లేనప్పుడల్లా అనుపమ దగ్గరకు వాలిపోతున్నాడని, ఇద్దరు కలిసి మీడియా కంటపడకుండా చెట్టపట్టాలు వెలుసుకుని తిరుగుతున్నారని వినికిడి. మరి ప్రస్తుతం వైరల్ గా మారిన ఈ వార్తలో నిజం ఎంతవరకు ఉందొ తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు ఆగవలసిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here