హీరోని రేప్ చేసిన హీరోయిన్…మ్యాటర్ తెలిస్తే షాక్ అవుతారు!

0
313
మనం ఏ సినిమాలోనో లేక బయటో ఫలానా అమ్మాయిని రేప్ చేసారు అనే వార్తలు వింటుంటాం. నిజానికి సినిమాల్లో కూడా అమ్మాయిలను రేప్ చేసే సీన్లనే చూపిస్తుంటారు. అయితే మనం ఇప్పుడు చెప్పుకునే ఘటన వింటేనే మాత్రం అందరికి ఆశ్చర్యం వేయకమానదు. ఒక హీరోయిన్ ఏకంగా ఒక కుర్ర హీరోని రేప్ చేసి వార్తల్లో నిలిచి సంచలనం సృష్టించింది. ఇక మ్యాటర్లోకి వెళితే, ప్రముఖ హాలీవుడ్ నటి ఏసియా అర్జెంటినో ఇటీవల కొన్నేళ్ల క్రితం జెన్నీ బెన్నెట్ అనే కుర్ర హీరోని రేప్ చేసినట్లు ప్రస్తుతం వార్తలు అక్కడి మీడియాలో షికారు చేస్తున్నాయి. అయితే నిజానికి ఆ వార్త నిజమేనని బెన్నెట్ ఒప్పుకున్నాడు. 2013వ సంవత్సరంలో ఒక సినిమా షూటింగ్ సమయంలో తనకు మరియు అర్జెంటీనోకు మధ్య కొన్ని సన్నివేశాలు చిత్రీకరించిందట ఆ సినిమా యూనిట్. అనంతరం ఆ రోజు షూటింగ్ కి ప్యాకప్ చెప్పిన తరువాత తనతో సెల్ఫీ కోసం వచ్చిన బెన్నెట్ ని లోపలి పిలిచి అర్జెంటీనో అతడిపై ఘోరంగా అత్యాచారం చేసిందట. అయితే ఆ విషయాన్ని బయటపెట్టవద్దని, అందుకుగాను నీకు రూ.2 కోట్లు ఇస్తాను అని చెప్పి, నాలుగు విడతలుగా ఆ డబ్బు ఇచ్చిందట అర్జెంటీనో.
ఇక అప్పట్లో ఆ విషయాన్ని గోప్యంగా ఉంచారు ఆ ఇద్దరు. ఇక ప్రస్తుతం కొన్ని మీడియా ఛానల్స్ లో ఈ వార్త గుప్పుమనడం, ఆ తరువాత అది నిజమేనేని బెన్నెట్ ఒప్పుకోవడంతో అక్కడి ప్రజలందరూ ఒక్కసారిగా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అయినా ఈ విషయాన్ని ఎందుకు గోప్యంగా వుంచవలసి వచ్చిందో కూడా మీడియా కి చెప్పాడు బెన్నెట్. నిజానికి అర్జెంటీనో పెద్ద నటి కావడం, అదీ కాక ఈ వార్త కనుక ఒకవేళ బయటకు వస్తే ఆమె కెరీర్ తో పాటు తన కెరీర్ కూడాపాడవుతుందని భావించి తాను ఆమెనుండి డబ్బు తీసుకుని విషయాన్నీ గోప్యంగా ఉంచినట్లు తెలిపాడు. అయితే ఇందులో ఒక గమ్మత్తైన విషయం ఏమిటంటే, అర్జెంటీనో ప్రస్తుతం హాలీవుడ్ అంతటా మారుమ్రోగుతున్న మీటూ ఉద్యమంలో, తనపై కూడా లైంగిక వేధింపులు జరిగినట్లు ఒక సందర్భంలో ఆరోపించింది. దీనితో ఆమెపై అక్కడి ప్రజల్లో కొంత వ్యతిరేకత ప్రారంభమైనట్లు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియా వేదికల్లో వైరల్ గా మరి సంచలనం సృష్టిస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here