హీరోయిన్ ఇంటి ముందు మూత్రం పోసిన నటుడు….మ్యాటర్ తెలిస్తే ఆశ్చర్యపోతారు

0
312
ప్రముఖ బాలీవుడ్ నటి రాణీ ముఖర్జీ ఇంటి ముందు నటుడు అర్మాన్ కోహ్లీ మూత్రం పోయడం పలువురిని షాక్ కి గురి చేసింది. కోపంతోనే అర్మాన్ ఈ విధంగా ప్రవర్తించాడని తెలుస్తోంది. వాస్తవానికి ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు రాజ్ కుమార్ కోహ్లీ మరియు నటి నిషి ల కుమారుడు అర్మాన్, మొదటినుండి కొంత కోపిష్టి అని అంటున్నారు ఆయన సన్నిహితులు. కాగా నేడు ఒక విషయమై తన కోపాన్ని ఎలా తీర్చుకోవాలో అర్ధంకాని అర్మాన్, ఒక హీరోయిన్ ఇంటి ముందు ఇలాంటి చర్యకి పాల్పడ్డాడు. అసలు విషయంలోకి వెళితే, రాణీ ముఖర్జీ కజిన్ తానీషా ముఖర్జీ మరియు అర్మాన్ ఏడాది కాలంగా డేటింగ్ లో వున్నారు. మొదట్లో ఇద్దరు చాలా బాగావుండేవారని, అయితే ఏమైందో ఏమో తెలియదుగాని సడన్ గా వారిద్దరి మధ్య గొడవలు రావడంతో ఈ జంట విడిపోయారు. విడిపోయే సమయంలో తనీషా, అర్మాన్ ల మధ్య పెద్ద యుద్ధమే నడిచిందని, ఆ సమయంలో తానీషా అతడిని కొట్టినట్లు సమాచారం.
ఆ కారణంగానే ఆమెపై చాలారోజులనుండి అర్మాన్ ద్వేషాన్ని పెంచుకున్నాడు. ఇక చివరికి నేడు నటి రాణీముఖర్జీ నివాసం ముందు మూత్రం పోశాడట. అర్మాన్ వికృతి చేష్టలకు పాల్పడుతున్న సమయంలో అక్కడ ఉన్న మీడియా వర్గాలు ఫోటోలు తీయడంతో విషయం బయటకి వచ్చింది. అర్మాన్ పై ఇప్పటికే బాలీవుడ్ లో ఎన్నో విమర్శలు ఉన్నాయి. ఈ ఏడాదిలో నీరూ రాంధవ అనే అమ్మాయితో డేటింగ్ చేసి, ఆమెను ఇష్టమొచ్చినట్లు గాయపరిచి ఇంట్లో నుండి గెంటేశాడని, ఇక మళ్ళి ఇప్పుడు ఇలా తానీషాతో గొడవపడి నానా రాద్ధాంతం చేయడంతో స్థానిక పోలీసులు అతడిని న్యూసెన్స్ కేసులో అరెస్ట్ చేసారని తెలుస్తోంది. కాగా ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియా వేదికల్లో వైరల్ గా మారింది…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here