హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వనున్న రాజన్న సినిమా చైల్డ్ ఆర్టిస్ట్…..మ్యాటర్ కోసం ఇది చూడండి!

0
251
సినిమా ఇండస్ట్రీకి కొందరు యుక్త వయసులో అడుగుపెడితే, మరికొందరు చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చి, తరువాత తమ ప్రతిభతో మంచి ఆర్టిస్టులుగా ఎదిగిన వారు ఎందరో వున్నారు. అటువంటి వారిలో దివంగత శ్రీదేవి, రాశి, తులసి, హరీష్, సులక్షణ, సుజిత, జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు వంటివారు ఎందరో వున్నారు. ఇక అలా చిన్నతనంలో పలు సినిమాల్లో నటించి అందరిని ఆకట్టుకున్న చైల్డ్ ఆర్టిస్ట్ బేబీ ఆనీ. ఇక ఆ అమ్మాయి నటించిన సినిమాల్లో రాజన్న, స్వాగతం, మిత్రుడు, శౌర్యం, మిత్రుడు, విక్రమార్కుడు, కేడి, స్టాలిన్, ఏక్ నిరంజన్ సినిమాల్లో నటించింది. అయితే అనుకోకుండా ఒక రోజు సినిమాతో టాలీవుడ్ కి రంగప్రవేశం చేసిన ఆనికి బాగా గుర్తింపు తీసుకువచ్చింది మాత్రం రాజన్న సినిమానే అని చెప్పాలి. ఆ సినిమాలో ఆ అమ్మాయి పోషించిన మల్లమ్మ పాత్ర, ప్రేక్షకులకు విపరీతంగా చేరువయింది. ఇక తెలుగులో దాదాపుగా 25కు పైగా సినిమాల్లో నటించిన ఆని, పుట్టింది మరియు పెరిగింది హైదరాబాద్ లోనే. చిన్నతనం నుండి చదువులోనూ ఎప్పుడు ముందుండే ఆనికి, కళల పట్ల కూడా మంచి ఆసక్తి ఉండడం గమనించిన ఒక సినీ నిర్మాత మొదటగా ఆమెను సినిమాల్లోకి తీసుకువచ్చారట.
అయితే ఇటీవల కొన్నాళ్లుగా ఆ అమ్మాయి సినిమాలకు కొంతమేర విరామం ప్రకటించి, చదువు మీద శ్రద్ధ పెట్టిందట. ఇక ఇటీవల డిగ్రీ చదువును అభ్యసిస్తున్న ఆనికి ఇప్పుడిపుడే సినిమా అవకాశాలు కూడా వస్తున్నాయట. అయితే ఆమె తల్లితండ్రులు కూడా తాము అనుకుంటున్నట్లు మంచి పాత్ర వస్తేనే ఆమెతో హీరోయిన్ గా నటింపచేయాలని ఆశిస్తున్నారట. మరి నిన్నగాక మొన్న చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమా కెరీర్ ప్రారంభించిన ఆని, అప్పుడే మెల్లగా అవకాశాలు అందిపుచ్చుకుంటుందంటే, రేపు పూర్తి స్థాయి హీరోయిన్ అయ్యాక తాను చేసే పాత్రలతో తప్పకుండా తెలుగు ప్రేక్షకులను ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని పలువురు నెటిజన్లు సోషల్ మీడియా వేదికల్లో కామెంట్స్ చేస్తూ, ఆల్ ది బెస్ట్ ఆని అంటూ ఆమెకు ఇప్పటినుండే విషెస్ తెలుపుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here