హైపర్ ఆది స్కిట్ లో అదరగొట్టిన గెటప్ శ్రీను..మ్యాటర్ తెలిస్తే షాక్ అవుతారు!

0
380
తెలుగు టెలివిజన్ షో లలో ఎంతో పేరుగాంచి, మంచి రేటింగ్స్ తో దూసుకెళ్తున్న షోలలో ఈటీవీలో ప్రదర్శితమయ్యే జబర్దస్త్ ఒకటి. నిజానికి ఈ షోలో పాల్గొనే వారిలో ఎవరికి వారు విపరీతంగా అభిమానులను సంపాదించుకున్నారు. వారిలో ముందువరసలో ఉండేది ఎవరంటే మాత్రం మొదటగా గుర్తుకువచ్చే పేరు, హైపర్ ఆది. హైపర్ ఆది పేల్చే పంచులు, చేసే స్కిట్లు యూట్యూబ్ లో చాలావరకు కొన్ని మిలీయన్లకొద్దీ వ్యూలు సంపాదిస్తుంటాయంటే, ఆయనకు ప్రేక్షకుల్లో ఎటువంటి ఫాలోయింగ్ ఉందొ అర్ధం చేసుకోవచ్చు. ఇకపోతే కొన్ని అనివార్య కారణాలవల్ల నిన్నటి స్కిట్ లో రైజింగ్ రాజుతో కలిసి స్కిట్ లో పాల్గొనలేకపోయాడు ఆది. అయితే ఆదికి బదులు స్కిట్ లో పాల్గొన్న గెటప్ శ్రీను నిజంగా అయన లేని లోటును బాగా భర్తీ చేసాడనే చెప్పుకోవాలి. కాగా ఈ స్కిట్ మొత్తం మంచి హాస్యభరితంగా సాగి అందరిని అలరించిందనే చెప్పాలి. స్కిట్ లో ముందుగా భార్య మీద అనుమానంతో రైజింగ్ రాజు రకరకాల ఇళ్ళు మారుస్తుంటాడు. అందులో భాగంగా హైపర్ నిలయం అనే ఇంట్లో దిగుతుంది వాళ్ళ ఫ్యామిలీ.
ఆ ఇంటి ప్రక్కనే దొరబాబు అద్దెకు ఉండడం, ఇక గెటప్ శ్రీను రాజు మరియు శాంతి లకు వయసువచ్చినప్పటికీ మానసికంగా ఎదగని కొడుకుగా నటించి అందరితో నవ్వులు పూయించాడు గెటప్ శ్రీను. ఇకపోతే స్కిట్ లో భాగంగా ఒకరోజు ఆఫీస్ టైం అయిందని ఎప్పటిలానే ఆఫీసుకు వెళ్లిన రాజుకు సాయంత్రం ఇంటికి తిరిగిరాగానే తన అమాయక కొడుకు, మరియు భార్య పక్క ఇంటి దొరబాబుతో కలిసి మాట్లాడడం చూసి, అప్పుడే పక్కింటాయనతో సరసాలు మొదలెట్టేశావా అనగానే షోలో వారందరు పగలబడి నవ్వుతారు. ఇక తన కొడుకు ఒక్కసారిగా పక్కింటి ఆయనని డాడీ అని పిలవడంతో, ఒరెయ్ అయినా కాదురా డాడీ, నేను రా మీ డాడీని అని రాజు అనడం, దానికి లేదు నువ్వు అంకుల్ వి, ఆయనే మా డాడీ అనడంతో షోలో వారందరు ఒక్కసారిగా నవ్వుతారు. ఇక కాసేపటికి దొరబాబును బయటకు పంపేసి, కొడుకుని భార్యని కొట్టడం మొదలెడతాడు రాజు. అంతే వెంటనే కోపం తెచ్చుకున్న శ్రీను, డాడీ నన్ను కొడితే ఊరుకోను అంటూ తిరగబడి కొట్టడంతో రాజు ఒక్కసారిగా భయపడడం మంచి హాస్యభరితంగా ఉంటుంది.
ఇక మధ్యలో పక్కింటి దొరబాబు మళ్ళి వచ్చి వారి గొడవలో తలదూర్చడం, మొత్తం అందరిని రాజు కొట్టడం జరుగుతుంది. అంకుల్ ఇందాక అమ్మని కొట్టావు ఊరుకున్నాను, నాన్నని కొట్టావు ఊరుకున్నాను, ఇక నన్ను కొడితే చూస్తూ ఊరుకోను అనడంతో వెనుక బ్యాక్ గ్రౌండ్ లో ఛత్రపతి సౌండ్ వస్తుంది, అది విన్న అక్కడి ప్రేక్షకులు, జడ్జీలు విపరీతంగా నవ్వడం మొదలెడతారు. ఈ విధంగా హైపర్ అది లేని లోటుని గెటప్ శ్రీను తన భుజాలపై వేసుకుని స్కిట్ ని అద్భుతంగా ముందుకు తీసుకెళ్లాడు అని చెప్పడం లో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. ఇక ఈ స్కిట్ తమను బాగా ఎంటర్టైన్ చేసిందని, చాలా బాగుందని రోజా, నాగబాబులు శ్రీనును మెచ్చుకుంటారు….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here