హౌస్ లో కౌశల్ ప్రవర్తన గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన సామ్రాట్!

0
111

ఇటీవల జరిగిన బిగ్ బాస్ సీజన్ 2 మన తెలుగు ప్రేక్షకుల మనస్సులో చెరగని ముద్ర వేసిందని చెప్పవచ్చు. ఇక ఆ షోలో పాల్గొన్న కంటెస్టెంట్లలో ముఖ్యంగా విజేతగా నిలిచిన కౌషల్, రన్నరప్ గా నిలిచిన గీత మాధురి, ఇక ఫైనలిస్టులు దీప్తి నల్లమోతు, సామ్రాట్, తనీష్ లకు వారి వారి అభిమానులు ఇప్పటికి సోషల్ మీడియా వేదికల్లో మద్దతుపలుకుతూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఆ షోలో కౌషల్ ప్రవర్తన పై నిన్న జరిగిన ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడిన సామ్రాట్, అయన పై కొన్ని సంచలన కామెంట్స్ చేసాడు. ఫైనల్ లో కౌషల్ విజేతగా ప్రకటించబడగానే తాను నిజంగా పట్టరాని సంతోషం కలిగిందని, ఒకరకంగా విన్నర్ అవ్వడానికి కావాలసిన అన్ని అర్హతలు కౌశల్ కి ఉన్నాయని అన్నాడు. కౌషల్ షోలో తనకు నిజంగా ఒక బ్రదర్ లా అనిపించాడని, ఇద్దరం కలిసి షోలో ఫోటోలు దిగామని, బహుశా నేను అనుకోవడం, తాను కూడా నాలానే లైఫ్ లో కొన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నట్లు తనకు అనిపించిందని చెప్పుకొచ్చాడు సామ్రాట్.

ఇక ఒకానొక సమయంలో కౌషల్ కోసం తాను నామినేషన్ ని త్యాగం చేయడంతో కౌషల్ ఒక్కసారిగా ఉద్వేగంతో ఏడ్చేసాడని, అయితే అలా చేయడానికి షోలో కౌషల్ బిహేవియర్ నచ్చడం వల్లనే తాను అలా చేసినట్లు చెప్పాడు సామ్రాట్. ఇక షో ముగిసిన తరువాత తాము మా ఇంట్లో ఒకసారి కలిశామని, కౌషల్ కు మదర్ లేకపోవడంతో మా అమ్మని మీ అమ్మగా అనుకో బ్రదర్ అని అన్నానని, దానికి కౌషల్ ఎంతో సంతోషపడ్డాడని అన్నాడు. ఈ విధంగా సామ్రాట్, కౌషల్ పై పొగడ్తలు కురిపించడంతో కౌశల్ ఆర్మీ సామ్రాట్ ను యు ఆర్ రియల్లీ గ్రేట్ అంటూ సోషల్ మీడియా వేదికల్లో కామెంట్స్ చేస్తున్నారు….