తెరాస గెలుపు తర్వాత మహేష్ బాబు, సమంత ఏమి చెప్పారో తెలిస్తే షాక్ అవుతారు!

0
45

మొత్తానికి నేడు బయటకు వచ్చిన ఎన్నికల ఫలితాల ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ మరొక్కసారి అధికారాన్ని చేప్పట్టబోతోంది అనే విషయం సుస్పష్టం అయింది. అయితే ఈ ఎన్నికల్లో విజయం ముందే ఊహించినప్పటికీ, మెజార్టీపై కొంత తమ పార్టీ శ్రేణులలో చర్చ జరిగిందని, అయితే అన్ని అంచనాలను తలదన్ని గతంకంటే మంచి మెజారిటీ సాధించి టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుండడంతో ఆ పార్టీ శ్రేణులు ఇప్పటికే ఆనందోత్సహాల్లో మునిగిపోయాయి. అయితే వారి విజయంపై దేశవ్యాప్తంగా ప్రముఖులు ఆ పార్టీ అధినేత కేసీఆర్ కు అలానే కేటీఆర్ కు అభినందనలు తెలియచేస్తూ వారిని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. అయితే అందులో భాగంగా కాసేపటిక్రితం కేటీఆర్ కు సూపర్ స్టార్ మహేష్ బాబు ఫోన్ చేసి అభినందనలు తెలిపారట. గత ఎన్నికల కంటే ఈ ఎన్నికల్లో మరింత మెజారిటీ విజయం సాధించడం తనకు చాలా అందంగా ఉందని, అంతేకాక మీరు భవిష్యత్తులో మరిన్ని ఉన్నత స్థానాలు అధిరోహించాలని కోరుకుంటున్నట్లు చెప్పారట మహేష్.

ఇక మహేష్ బాబు కాల్ చేయడంతో ఎంతో ఆనందం వ్యక్తం చేసిన కేటీఆర్, మీరు మరియు మీ తండ్రిగారు ప్రభుత్వానికి అండగా నిలిచి టాలీవుడ్ ఇండస్ట్రీ తరపున మమ్మల్ని అభినందిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని అన్నారట. ఇక మరోవైపు కాసేపటి క్రితం టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన సమంత కూడా కేటీఆర్ కు కాల్ చేసి ఆయనకు అభినందనలు తెలిపారట. గత ప్రభుత్వంలో మీరు టాలీవుడ్ కి, అలానే రాష్ట్రానికి ఎన్నో సేవలు అందించారని, అందుకే ప్రజలు మరొకసారి మీరు ప్రభుత్వానికి పట్టం గట్టారని అన్నారట. ఇక ఆమె మాటలకు బదులిచ్చిన కేటీఆర్, మీకు ధన్యవాదాలు, మా ప్రభుత్వం తరపున రాబోయే రోజుల్లో టాలీవుడ్ పరిశ్రమకు మరిన్ని ప్రోత్సాహకాలు అందిస్తామని అన్నారట.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here