ఒకేసారి 16 మంది నర్సులు చేసిన పని తెలిస్తే ఆశ్చర్యపోతారు!

0
126
మన ఊహకు అందనివిధంగా జరిగే ఏ విషయాన్ని అయినా అద్భుతం అనే అంటాము. నిజానికి సాధారణంగా జరిగే పనులకు చాలావరకు విభిన్నంగా ఏదైనా జరిగితే దాన్ని కూడా అద్భుతమని, లేదా విచిత్రమని అంటారు. ఇక మనం ఇప్పుడు చెప్పుకోబోయేది అటువంటి ఘటనే. అరిజోన లోని మీసాలో గల బ్యానర్ డిజర్ట్ అనే ఆసుపత్రిలో పనిచేస్తున్న నర్సుల్లో ఏకంగా 16మంది నర్సులు ఒకేసారి తల్లికాబోవడం కొంత యాదృచ్చికమే అయినప్పటికీ కూడా ఇది నమ్మక తప్పని నిజం. అయితే ఇందులో ఒక గమ్మత్తైన విషయం ఏమిటంటే, వీరిలో చాలామందికి నిన్నమొన్నటివరకు తామందరం దాదాపుగా కొంత వ్యవధి తేడాలో తల్లికాబోతున్నాం అనే విషయం తెలియకపోవడం. అయితే వీరందరికి ఫేస్ బుక్ లో ఒక గ్రూప్ ఉండడం, అందరూ కలిసి ఇటీవల తమ ప్రెగ్నెన్సీకి సంబంధించి ఎప్పుడు డెలివరీ అవుతున్నారో అనే విషయాలను ఒకరికొకరు పంచుకున్నపుడు ఈ విచిత్రం బయటపడింది.
ఇక ఒక్కసారిగా 16మంది నర్సులు తల్లికాబోతుండడంతో ఆసుపత్రి సిబ్బంది రోగులకు ఆ సమయంలో వైద్యసేవలకు ఏ మాత్రం ఇబ్బంది కలుగకుండా కొన్ని ప్రత్యామ్నాయ చర్యలు కూడా తీసుకోవడానికి సిద్దమయిందట. ఇక వీరందరూ రాబోయే జూన్ నుండి అక్టోబర్ మధ్యలోనే తల్లులు కానుండడంతో ఆ సమయంలో తాత్కాలిక సిబ్బంది కావాలని త్వరలోనే తమ ఆసుపత్రి తరపున ప్రకటన జారీ చేయనున్నట్లు ఆసుపత్రి వర్గాలు చెప్పాయి. ఇక ఈ విషయమై  వచ్చిన కొందరు రోగులు సైతం కొంత ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారట. అయితే ఇందులో కొంత తప్పు అర్ధం దొర్లుతున్నప్పటికీ, అందరూ అనుకుంటున్నట్లు ఎటువంటి తప్పులేదని, అలా వారందరూ ఒకేసారి తల్లికావడం పూర్తిగా యాదృచ్చికమని ఆ నర్సులు వచ్చిన రోగులకు వివరిస్తున్నారట. కాగా ప్రస్తుతం ఈ ఘటన మీసా ప్రాంతంలో వైరల్ గా మారింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here