2వ రోజు వీర రాఘవుడి కలెక్షన్ల వీరవిహారం చూస్తే అదుర్స్!

0
285

మొదటి రోజు కొంత మిక్స్డ్ టాక్ సంపాదించిన ఎన్టీఆర్ లేటెస్ట్ మూవీ అరవింద సమేత, నేడు రెండవ రోజు మరింత కలెక్షన్లు పుంజుకుని ముందుకు సాగుతున్నట్లు సమాచారం. ఇక ఇప్పటికే మొదిరోజు కలెక్షన్లతో చాలా ఏరియాల్లో మంచి రికార్డులు సంపాదించిన ఈ సినిమా, నిన్నటితో పోలిస్తే కొంతవరకు మంచి టాక్ ను సంపాదించింది. ఇక ఎక్కడ చూసినా ఎన్టీఆర్ ఫాన్స్ పండుగ చేసుకుంటున్నారు. నిజానికి నిన్న బెనిఫిట్ షో టైములో మాకు సినిమా ఆశించినంత లేదని చెప్పిన కొందరు ఎన్టీఆర్ ఫ్యాన్స్, నేడు చూస్తే సినిమా అదిరిపోయిందని, ఇక నిన్నటితో పోలిస్తే టాక్ మరింత పెరిగి, ప్రేక్షకులు థియేటర్ల వద్దకు క్యూకడుతూ ఉండడం చాలా ఆనందంగా ఉందని వారు అంటున్నారు. ఇక ఈ సినిమాలో యాక్షన్ మరియు ఎమోషన్సన్నివేశాలు, పెనీవిటి సాంగ్, ఎన్టీఆర్ మరియు విలన్ జగపతి బాబు ల కాంబినేషన్లో వచ్చిన సన్నివేశాలు ప్రేక్షకులతో హాల్లో విజిల్స్ వేయిస్తున్నాయట. ఇకపోతే, సినిమాలో వచ్చే ఫస్ట్ ఫైట్ ఫ్యాన్స్ తో హాల్లో ఫ్యాన్స్ తెగ ఎంజాయ్ చేస్తున్నారట..

ఇక ప్రీ ఇంటర్వెల్ బ్యాంగ్, క్లైమాక్స్, ఇక అన్నిటికంటే హీరోకి మరియు తన నానమ్మకి మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకుల హృదయానికి హత్తుకుంటున్నాయని, మహిళకు ఆ సన్నివేశాలకు బాగా కనెక్ట్ అవుతున్నారని అంటున్నారు. అన్నిటికంటే సినిమాలో ఎన్టీఆర్ ఎనర్జిటిక్ యాక్షన్, డాన్సులు, ఫైట్లు ఫ్యాన్స్ ని బాగా అలరిస్తున్నాయని, అందుకే ఒకసారి చూసినవారు మళ్ళి మళ్ళి సినిమా చూడటానికి వస్తున్నారట. ఒకరకంగా మన వీర రాఘవుడు, రెండవ రోజునుండి మరింత కలెక్షన్లు పుంజుకుని ముందుకు సాగుతున్నాడని, ఇక మరొక వారం వరకు మరే సినిమా లేకపోవడంతో ఈ వారం రోజులు మంచి కలెక్షన్లు ఈ సినిమాకు వచ్చే అవకాశం కనపడుతోందని సినిమా అనలిస్టులు చెపుతున్నారు…..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here