రూ.2000 నోటుపై బ్రేకింగ్ న్యూస్… చూడకపోతే చాలా నష్టపోతారు!

0
119
భారత ప్రధాని నరేంద్రమోడీ, మన దేశంలో ఇటీవల రద్దు చేసిన పాత రూ.500 రూ.1000 తరువాత దేశవ్యాప్తంగా కొన్ని సమస్యలు ఉత్పన్నమయ్యాయి. నిజానికి ఈ సమస్యలు రద్దు చేసి పాత, నోట్ల స్థానములో వచ్చిన రూ.2000 నోట్లతో వచ్చాయి అనే చెప్పాలి. ఎందుకంటే ఈ నోట్లు మార్కెట్ లోకి వచ్చిన రోజునుండి విపరీతంగా చిల్లర కొరత ఏర్పడడం, అలానే వీటిని అప్పట్లో కొందరు ఫేక్ నోట్లు సృష్టించి చలామణి చేసి మోసాలు చేయడం వంటి ఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఇక ఇటీవల ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో దాదాపుగా రూ.2 కోట్ల విలువచేసే రెండువేల రూపాయల నకిలీ నోట్లను పట్టుకున్నారు అక్కడి పోలీసులు. అయితే ప్రస్తుతం దేశంలో రూ.2000 నోట్ల విషయంలో ఏవి నకిలీవో, ఏవి అసలువో తెలుసుకోవడం కొంత కష్టతరంగా మారింది. అయితే రిజర్వు బ్యాంకు వారు ఇటీవల సూచించిన మూడు పాయింట్స్ ద్వారా మన దగ్గరకు వచ్చిన రూ.2000 నోటు ఆసలైనదో లేక నకిలీదో ఇట్టే చెప్పేయవచ్చు. ఆ పాయింట్స్ ఏమిటంటే, ముందుగా ఆ నోటుపై మనకు కనపడే ఆకుపచ్చ రంగు త్రెడ్ ని కొంచెం వంచినపుడు, లేదా నలిపినపుడు అది వెంటనే బ్లూ కలర్ కు మారడం మనం గమనించవచ్చు.
అలానే దానిని కొంత వెలుతురులో బాగా పరిశీలిస్తే ఆ త్రెడ్ లోపల రెండువేల రూపాయలు అని రాసి ఉండడం గమనించవచ్చు. ఇక మూడవ పాయింట్ ఏంటంటే, నోటు పై ఒక అంచులో మనకు ఏడు నల్ల గీతాలు కొంత ఎక్కువ తక్కువలుగా గీసి ఉండడం గమనించవచ్చు. ఈ విధంగా మూడు రకాల సెక్యూరిటీ చెక్స్ చేసి చూస్తే మనకు ఆ నోటు అసలుదో, లేక నకిలీదో కొన్ని సెకన్లలో తెలుసుకోవచ్చు. ఇక ఈ విధమైన సూచనలను పాటించి ప్రజలు రూ.2000 నోట్ల లో నకిలీలను గుర్తించవచ్చని రిజర్వు బ్యాంక్ అధికారులు చెపుతున్నారు. సో చూసారుగా ఫ్రెండ్స్, మీరు కూడా పైన చెప్పిన విధంగా రెండువేల రూపాయల నోట్ల అసలు, నకిలీలను గుర్తించి జాగ్రత్తపడడండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here