2018 లో భారీ ఫ్లాపులు ఇవే…..!

0
88
మొత్తానికి ఈ ఏడాది కూడా గడిచిపోయింది. ఇంకొక్క రెండు రోజుల్లో నూతన సంవత్సరం కూడా రాబోతోంది. ఇక ఈ సంవత్సరం టాలీవుడ్ లో కొన్ని పెద్ద మరియు మరికొన్ని చిన్న సినిమాలు విజయాన్ని అందుకున్నాయి. ఇకపోతే ఈ సంవత్సరం కొన్ని సినిమాలు విపరీతమైన అంచనాల మధ్య విడుదలై వాటిని అందుకోవడంలో విఫలమై బాక్సాఫీస్ వద్ద బోల్తాపడ్డాయి. ఇక వాటి వివరాలు తెలుసుకుందాం, మొదటగా జనవరిలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ హ్యాట్రిక్ కాంబినేషన్లో వచ్చిన అజ్ఞాతవాసి సినిమాపై కేవలం మెగా అభిమానులు మాత్రమే కాదు, యావత్ తెలుగు ప్రేక్షకులు అందరూ ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. అయితే ఆ సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ సినిమా, ఆ అంచనాలను అందుకోవడంలో విఫలమై బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. ఇక ఆ తరువాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, నూతన దర్శకుడు వక్కంతం వంశి దర్శకత్వంలో వచ్చిన సినిమా నా పేరు సూర్య. ఈ సినిమా పై కూడా టాలీవుడ్ లో విపరీతమైన అంచనాలు వున్నాయి. అయితే మే లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఫ్లాప్ గా నిలిచి బన్నీ అభిమానులను నిరాశపరిచింది.
Image result for 2018 flop movies telugu
ఇక మాస్ మహారాజ రవితేజ నటించిన టచ్ చేసి చూడు, నెల టిక్కెట్టు, అమర్ అక్బర్ ఆంటోనీ సినిమాలు కూడా ఈ ఏడాది మంచి అంచనాలతో విడుదలై ఫలపు గా నిలిచాయి.  ఇక మరొక మెగా హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన ఇంటెలిజెంట్, తేజ్ ఐ లవ్ యు సినిమాలు కూడా ఈ ఏడాది విడుదలై బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ ని మూటగట్టుకున్నాయి. ఇకపోతే అక్కినేని వారసుడు నాగ చైతన్య నటించిన శైలజ రెడ్డి అల్లుడు, సవ్యసాచి సినిమాలు కూడా ఫ్లాప్ గా నిలిచి అయన కెరీర్ ని కొంత ఇబ్బందుల్లో పడేశాయి. ఇకపోతే గత ఏడాది అర్జున్ రెడ్డి సినిమాతో సూపర్ హిట్ సొంతం చేసుకున్న యూత్ హీరో విజయ్ దేవరకొండ ఈ ఏడాది గీత గోవిందం తో హిట్ కొట్టి, టాక్సీ వాళ్లతో పర్వాలేదనిపించగా నోటా సినిమా మాత్రం ఫ్లాప్ సినిమాగా నిలిచింది. ఇకపోతే ఈ ఏడాది చివర్లో వచ్చిన నెక్స్ట్ ఏంటి, పడి పడి లేచే మనసు సినిమాలు కూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేక చతికిల పడ్డాయ్…..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here