2019లో ఈ ఐదు రాశుల వారు పట్టిందల్లా బంగారమే!

0
288
మనలో చాలా మంది రాశి ఫలాలను, గ్రహ ఫలాలను నమ్ముతారు. నిజానికి మన పూర్వీకులు చెప్పినట్లు గ్రహ గమనాలు అనేవి మన జీవితం పై చాల వరకు ప్రభావం చూపుతాయని, అయితే వాటి ప్రభావాల నుంచి తప్పించుకోవడానికి మాత్రం కొన్ని పరిహారాలు చేయవలసి ఉంటుంది. ఇక మనం చెప్పుకోబోయే ఐదు రాశుల వారికీ రాబోయే 2019లో సంవత్సరంలో అంతా శుభమే అని, వారు పట్టిందల్లా దాదాపుగా బంగారు మాయం అవుతుందనేది చాలావరకు జ్యోతిష్కుల మాట. మరి అవి యేవో చూద్దాం. వాటిలో మొదటి రాశి వృశ్చిక రాశి, ఈ రాశి వారిలో వ్యాపారం చేసేవారి వ్యాపారాభివృద్ధి బాగా జరుగుతుందట. అంతేకాదు ఈ రాశివారికి రక్షణ రంగంలో ఉద్యోగం ప్రాప్తించే అవకాశం ఉందట.
ఇక ఎన్నో ఏళ్లుగా అవ్వని పనులు కూడా ఈ సంవత్సరం వెంటనే పూర్తి అవుతాయట. ఇక రెండవ రాశి సింహ రాశి, సూర్యుడిని అధిపతిగా గల ఈ రాశి వారికి సూర్యభగవానుడు 2019లో పట్టిందల్లా బంగారం చేస్తాడట. తీరని రుణాలు తీరిపోతాయని, ఇక వసూళ్లు కానీ బాకీలు తక్షణమే వసూలు అయి, వీరు ఏ పని తలపెట్టినా ఎటువంటి ఆటంకాలు లేకుండా అన్నింటా విజ్జయం సాధిస్తారట. తరువాతి రాశి మేష రాశి, అగ్నితత్వం గల ఈ రాశి వారికి అధిపతి కుజుడు కావడం, అలానే సంఖ్య శస్త్ర పరంగా కుజుడు 9వ సంఖ్యలో ఉండడం, అదీకాక 2019ని కూడితే వచ్చే 3 అనే సంఖ్య తొమ్మిదికి దగ్గర సంబంధం ఉండడంవల్ల ఈ రాశివారికి రాబోయే సంవత్సరం అదృష్టమయం అవుతుందట. ఎన్నో ఏళ్లుగా జరగని పనులు కూడా ఈ సంవత్సరం వేగవంతంగా పూర్తి అవుతాయట, ఇక వివాహాలు కావలసినవారికి వెంటనే వివాహం అయి, ఆనందదాయకమైన జీవితం లభిస్తుందట, ఇక ఆర్ధికంగా కూడా చాలా లాభదాయకంగా ఉంటుందని చెపుతున్నారు.
ఇక తరువాతి రాశి ధనుస్సు రాశి, ఈ రాశి విద్యార్థులకు శుభం జరుగుతుందట, ఇక ప్రేమ వివాహాలు చేసుకోదలచిన వారికి అనుకూలం మరియు ఆస్తివివాదాలు తొలగిపోయి అన్నిపనులు వేగంగా అవుతాయట. కాకపోతే కాస్త కష్టించి పని చేయాల్సివుంటుందని చెపుతున్నారు. ఇక ఆఖరిది వృషభ రాశి, ఈ రాశి భూ తత్వపు రాశి, కాగా కుజుడు, రాహువు, బుధుడు అధిపతులుగా వుంటారు. ఇక 2019లో వీరికి ధనలాభం అధికంగా ఉంటుందని, అంతేకాక జీవిత భాగస్వామితో గొడవలు ఉంటే తక్షణమే తొలిగి, పరిస్థితులు అదుపులోకి వస్తాయట. సో చూసారుగా ఫ్రెండ్స్, మరి మీ రాశి కూడా ఈ ఐదు రాశుల్లో ఉందేమో చూసుకోండి…..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here