0
207

ఈటివి, ఇతర తెలుగు ఛానల్స్ తో పోలిస్తే ఇదివరకు కొంత వెనుకపడిన విషయం ఒప్పుకోవలసిందే. ఎందుకంటే కొన్నాళ్లక్రితం జీ తెలుగు, మరోవైపు స్టార్ మా, ఇంకొకవైపు జెమిని ఛానల్స్ దూసుకుపోవడంతో, కాస్త వెనుకపడిన ఈటీవికి ఒక్కసారిగా బూస్ట్ నిచ్చిన షో మాత్రం జబర్దస్త్ అనే చెప్పుకోవాలి. అయితే ఈ షో ప్రసారం అయిన దగ్గరినుండి ఇప్పటికీ ఆ షోకి వస్తున్న రేటింగ్స్ దాదాపుగా ఏ షోకి రావడంలేదనేది నగ్న సత్యం అని కొందరు విశ్లేషకులు అంటున్నారు. ఇకపోతే ఆ షోలో మంచి పేరు సంపాదించిన వారిలో అగ్రభాగాన నిలిచేది మాత్రం హైపర్ ఆది, చమ్మక్ చంద్ర, గెటప్ శ్రీను, అదిరే అభి, చలాకి చంటి, బులెట్ భాస్కర్, వంటి వారు అనే చెప్పుకోవాలి. అయితే ఎందరు ఉన్నప్పటికీ హైపర్ అది మాత్రం అందరికంటే ఒకింత ప్రత్యేకం. ఎందుకంటే అయన వేసే డైలాగుల పంచులకి కేవలం ఆడియన్స్ మాత్రమే కాదు సెట్లోని వారు కూడా పగలబడి నవ్వుతుంటారు. ఇక ఇటీవల కొద్దిరోజులుగా అది జబర్దస్త్ లో పాల్గొనకపోవడం పై పలువురు ప్రజలు తమకు తోచిన విధంగా సోషల్ మీడియాలో పలు పుకార్లు లేవనెత్తుతున్నారు. అయితే నిజానికి ఆది జబర్దస్త్ కు రాకపోవడానికి ఒక బలమైన కారణం వుందని, అది తెలిస్తే మాత్రం షాక్ అవ్వకతప్పదని తెలుస్తోంది.

ఆది వేసే స్కిట్స్ లోని పంచులు ఎంత అదిరిపోతాయో, అలానే అయన మెలమెల్లగా తన పంచులతోపాటు రెమ్యూనిరేషన్ కి కూడా పెంచేసాడట. ఇక ప్రస్తుతం ఒక్క జబర్దస్త్ షో లోనే కాదు దాదాపుగా ఆ ఛానల్ లో ఒక ప్రముఖ సెలెబ్రిటీ అందుకే పారితోషికాన్ని ఆది ,కోరుతున్నట్లు సమాచారం. కాగా అతడి గొంతెమ్మ కోరికలను తీర్చి, అంత పారితోషికం ఇచ్చుకోలేని ఛానల్ వారు అతడిని షోలో తీసుకోవడం లేదని తెలుస్తోంది. నిజానికి ఆది మొదట షోలోకి వచ్చినపుడు అతని రెమ్యూనరేషన్ వందల్లో ఉండేదని, ఇక ప్రస్తుతం అతడి ఒక్క స్కిట్ కు కొన్ని మిలియన్ల కొద్దీ వ్యూస్ వస్తున్నాయి కాబట్టి అతడు ఆ మాత్రం అడగడం సబబేనని కొందరు అంటున్నారు. ఎంతైనా తనకు జీవితాన్ని, ఒక గమ్యాన్ని ఇచ్చిన ఆ ఛానల్ వారిని ఆది మరీ అలా డిమాండ్ చేయడం మాత్రం సమంజసం కాదని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. కాగా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఈ న్యూస్ పై మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపం లో తెలియచేయండి..

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here