సవ్యసాచి మూవీ చూసిన సమంత ఏమున్నదో తెలిస్తే షాక్ అవుతారు!

0
114

యువ సామ్రాట్ నాగ చైతన్య హీరోగా మైత్రి మూవీ మేకర్స్ పతాకం పై చందు మొండేటి దర్శకత్వంలో రూపొందిన లేటెస్ట్ మూవీ సవ్యసాచి. ఒక విభిన్నమైన కథాంశంతో రూపొందిన ఈ సినిమా, నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇకపోతే, ఈ సినిమాపై చాలావరకు పాజిటివ్ రిపోర్ట్ వస్తున్నట్లు తెలుస్తోంది. ఇక నేడు హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో బెనిఫిట్ షోలు చూసిన అక్కినేని అభిమానులు మంచి విజయోత్సాహంతో వున్నారు. ఇక సినిమాలోని ఫస్ట్ హాఫ్ ని మంచి ఎంటర్టైనింగ్ గా నడిపిన దర్శకుడు, సెకండ్ హాఫ్ లో స్టోరీ ని మరింత బలంగా ముందుకు తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఇక సినిమాలో కీరవాణి అందించిన సంగీతం, యువరాజ్ ఫోటోగ్రఫీ, ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వర రావు తదితరులు సినిమాకి మంచి బలాన్నిచ్చారట. సినిమాలో హీరో నాగ చైతన్యతో పాటు విలన్ గా చేసిన మాధవన్ తన అద్భుత నటనతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాడని, మరియు హీరోయిన్ నిధి అగర్వాల్ తన అందంతో, మరియు నటనతో ప్రేక్షకులను ఉర్రూతలూగించిందట.

ఇకపోతే ముఖ్యంగా చెప్పుకోవలసింది హీరో నాగ చైతన్య గురించి. చైతన్య చేసిన గత చిత్రాలతో పోలిస్తే ఇది పక్కా కమర్షియల్ మరియు మాస్ కథాంశంతో వచ్చిన సినిమా అని, అంతేకాదు ఈ సినిమాతో చైతన్య కూడా స్టార్ హీరోల సరసన చేరిపోయినట్లే అని సినిమా చూసిన వారు అంటున్నారు. ఇక ఈ సినిమా చూసిన సమంత, భర్త చైతన్యపై ప్రశంశల జల్లు కురిపించిందట. సినిమా తనకు బాగా నచ్చిందని, దర్శకుడు చందూ సినిమాను నడిపించిన తీరు నిజంగా అద్భుతమని, అలానే సినిమాలో చైతన్య పెర్ఫార్మన్స్ చాలాబాగుందని చెప్పిందట. ఇక నిధి అగర్వాల్ కూడా తన అందం, నటనతో ఆకట్టుకుందని, సినిమాలో తనకు మాధవన్ నటన బాగా నచ్చిందని, అయన కాకుండా మరెవరూ ఆ పాత్రని చేయలేరని సమంత చెప్పినట్లు తెలుస్తోంది. ఇక సినిమాలో కామెడీ మరియు యాక్షన్ సన్నివేశాలు సినిమాలో అలరించాయని, ఇక ఫైట్స్ లో చైతన్య బాగా నటించాడని తన భర్తని ఆకాశానికి ఎత్తేసిందట సమంత. ప్రస్తుతం సమంత సవ్యసాచిపై చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్ వర్గాల్లో వైరల్ గా మారాయి.

Savyasachi Public Talk |Savyasachi Movie Talk|Savyasachi First Talk|#Nagachaitanya|GARAM CHAI