సర్వ బాధలను దూరం చేసి, సకల శుభాలు అనుగ్రహించే 7 శ్రీకృష్ణ మంత్రాలు!  

0
122
మనలో చాలామందికి దైవం అంటే నమ్మకం ఉంటుంది. నిజానికి మనలో ఎవ్వరూ దేవుడిని చూడనప్పటికీ ఎవరి మతాన్ని బట్టి వారికి తమ తమ దేవుళ్ళ మీద నమ్మకం ఉంటుంది. ఇక హిదువులు అత్యధికంగా ఉండి, నమ్మకాలకు నెలవైన మన భారత దేశంలో అయితే దేవుడిపై నమ్మకం మరింతగా ఎక్కువనే చెప్పాలి. ఇక హిందూ దేవుళ్లలో శ్రీకృష్ణుని ఉపాసించేవారు చాలామంది వుంటారు. ఇక ఆ శ్రీ కృష్ణ భగవానునికి అంకితం చేయబడిన మంత్రాలను స్మరించుకోవడం ద్వారా, పాప పంకిలమైన చర్యలతో నిండిపోయిన కలియుగం శుద్ది చేయబడుతుందని అంటున్నారు ఆధ్యాత్మికవేత్తలు. అయితే రోజూ క్రమం తప్పకుండా ఈ మంత్రాలు పఠించడం వలన ఆధ్యాత్మిక సౌష్టవం మరియు మానసిక ప్రశాంతత కలిగి, మనకు కలిగే కష్టాలు తొలగి, అన్నింటా విజయాలు సిద్ధిస్తాయని కూడా అందిస్తాయని చెప్పబడినది. మొదటగా ఓం శ్రీ కృష్ణా శరణం మమః  అని జపించాలి దాని అర్ధం ‘ కృష్ణా, నీ ఆశ్రయంలో నాకింత చోటును ప్రసాదించు స్వామీ, నా ఈ జీవితం నీ సేవకే అంకితం’ అని, అయితే అది పఠించడంవలన ఫలితం ఏంటంటే, శ్రీ కృష్ణుని యొక్క పేరుతో కూడిన ఈ మంత్రం, వ్యక్తి జీవితంలోని అన్ని శోకాలను, దుఃఖాలను పటాపంచలు చేసి, మానసిక శాంతికి తోడ్పాటునందిస్తుందని చెప్పబడినది.
Image result for lord srikrishna
ఇక మరొకటి ఓం కృష్ణాయ నమః, ఈ మంత్రం యొక్క అర్ధం ఓ శ్రీకృష్ణ ప్రభువా, నా వందనాన్ని స్వీకరించు అని. అయితే దీనిని పఠించడం వలన మన దైనందిన జీవితంలో ఒడిదుడుకుల నుండి ఉపశమనం, మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఇక ఇంకొకటి  ఓం దేవకీనందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహీ తన్మై కృష్ణా ప్రచోదయాత్” దీని ఫలితం,  జీవితంలో ఎదురయ్యే అనేక సమస్యల నుండి మానసిక ప్రశాంతత కలిగి మంచి ఆరోగ్యం కూడా మనకు సిద్ధిస్తుంది. ఇక వేరొకటి, హరే కృష్ణ హరే, కృష్ణ కృష్ణ హరే హరే ! హరే రామ హరే రామ, రామ రామ హరే హరే !!  ఈ 16 పదాల వైష్ణవ మంత్రం, అత్యంత ప్రజాదరణ పొందిన కృష్ణుని మంత్రంగా ఉంది. మొట్టమొదటి సారిగా కలి సాంతరణ ఉపనిషత్తులో లిఖించబడినట్లు చెప్పబడినది. దీని ఫలితం, ఈ దైవిక మంత్రం భక్తులను ఆధ్యాత్మిక విమానంలో ఒక ప్రపంచం నుండి మరొక దైవిక ప్రపంచంలోనికి తీసుకుని వెళ్లి, వారి ఆత్మను శ్రీ కృష్ణునితో నేరుగా అనుసందానిస్తుందని నమ్ముతారు. ఇక మరొకటి “జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద్ శ్రీ అద్వైత గధాధర్ శ్రీ వాసది గౌర్ భక్త బృంద”. ఇక దీని అర్థం ప్రకారం ఈ మంత్రం, కృష్ణుడికి చెందిన గొప్ప భక్తులను సూచిస్తుంది మరియు వారి ప్రశంసలను కృష్ణునికి చేరవేసే మాధ్యమంగా ఉంటుంది.
Related image
ఇక వేరొకటి, శ్రీ కృష్ణ గోవిందా హరే మురారే, హే నాథా నారాయణ వాసుదేవాయ ! ఇక దీని ఫలితం వలన, శ్రీ కృష్ణుడి యొక్క దయ మరియు ఆశీర్వాదాన్ని పొందేందుకు ఉద్దేశించబడిన మంత్రమిది. ఇకపోతే తక్షణ ఫలితాలకై ఉద్దేశించబడిన మంత్రంగా చెప్పబడిన మంత్రం ఏంటంటే, ఓం క్లీం కృష్ణాయ నమః ! కానీ ఈ మంత్రోచ్చారణ కొన్ని నియమాలతో నిర్దేశించబడినది. మీ ఆలయ పూజారిని సంప్రదించడం ద్వారా వివరాలను తెలుసుకుని పాటించాలట, ఇక దీని ఫలితం ఏంటంటే, ఎటువంటి క్లిష్ట సమస్యనైనా తొలగించే కృష్ణ మంత్రంగా ఇది చెప్పబడినది.  ఇక పైన చెప్పబడిన ఈ ఏడూ  శ్రీ కృష్ణ భగవానుని మంత్రాలను పఠించుటకు అనువైన సమయంగా బ్రహ్మ ముహూర్తం నిర్దేశించబడినది. ఈ బ్రహ్మ ముహూర్తం ఉదయం 4 నుండి 6 గంటల మధ్య ఉంటుంది. ఉదయాన్నే అభ్యంగన స్నానం చేసి, ఉతికిన బట్టలు ధరించి కృష్ణుని పటం ముందు కూర్చుని, 108 సార్లు గుణకాలలో మంత్రాలను పఠించవలసి ఉంటుంది. ఇక వీటిలో మీ మనసుకు తోచిన ఏ మంత్రాన్నైనా పఠించవచ్చు. కావున తామెల్లరు ఈ మంత్రాలను పఠించి ఆ శ్రీకృష్ణ ప్రభువు కృప పొందగలరని కోరుతున్నాం….
Image result for lord srikrishna

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here