90 మంది పిల్లలకు హెచ్ ఐ వి అంటించిన డాక్టర్

0
24

ప్రాణాలు కాపాడాల్సిన డాక్టర్ అత్యంత ప్రాణాంతకమైన వ్యాధిని అంటించాడు ఆరోగ్యం గురించి సలహాలు ఇవ్వాల్సిన డాక్టర్ అనారోగ్యం బారిన పడేశాడు. పాకిస్థాన్ లో ఓ  డాక్టర్ 60 చిన్నారులు సహా మొత్తం 90 మందికి హెచ్ ఐ వి సోకడానికి కారణమయ్యాడు. కలుషితమైన   సిరంజిని వాడడంతో అతడు హెచ్ ఐ వి ని వ్యాపింపజేశాడు. ఆరోగ్య శాఖా పిర్యాదు మేరకు ఆ డాక్టర్ ను పోలీసులు అరెస్ట్ చేసారు. అతడికి  కూడా హెచ్ ఐ వి వ్యాధి ఉండడం విశేషం. సింధు ప్రావిన్షు లోని లార్కనా శివారు పట్టణంలో 18 మంది చిన్నారులను పరీక్షించగా హెచ్ ఐ వి సోకినట్టు తేలింది. దీంతో మరికొంత మంది పరీక్షించగా 65 మంది పిల్లలకు హెచ్ ఐ వి మొత్తం 90 మందికి పైగా  పిల్లలు హెచ్ ఐ వి బారిన పడినట్టు తేలింది. ఇక్కడ విషయం ఏంటంటే హెచ్ ఐ వి బారీన పడిన చిన్నారుల తల్లిదడ్రులను పరిక్షించగా వారికీ హెచ్ ఐ వి లేదని  తేలింది. దీంతో అధికారులు కారణం ఏంటో తెలుసు కోవడానికి లోతుగా ఆరాతీయగా ఓ డాక్టర్ కలుషిత సిరంజిలను వాడినట్టు తేలింది. ఆ డాక్టరుని అరెస్ట్ చేశామని ఆరోగ్య శాఖా  మంత్రి తెలిపారు, ఇంకెవరైనా ఈ డాక్టర్ ద్వారా హెచ్ ఐ వి బారిన పడ్డారేమోనని తెలుసుకునేందుకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here