కేసీఆర్ గెలుపు కోసం నాలుక కోసుకున్న ఆంధ్ర కుర్రోడు ….. మ్యాటర్ తెలిస్తే షాక్ అవుతారు!

0
97
టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి సీఎం కావాలని ఓ యువకుడు నాలుక కోసుకున్న ఘటన ప్రస్తుతం రాష్త్ర వ్యాప్తంగా వైరల్ గా మారింది. నిజానికి ఎన్నో ఏళ్ళ నుండి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ఇక్కడి ఎందరో త్యాగధనులు ఆత్మార్పణ చేసుకున్నారు. అయితే అదేవిధంగా ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం 2001లో టిఆర్ఎస్ పార్టీని స్థాపించి అప్పటినుండి నిరంతరం శ్రమించి, చివరికి రాష్ట్రం సాధించుకోవడం కోసం నిరాహార దీక్ష కూడా చేసి, చివరకు ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిన ఘనత టిఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు మాత్రమే దక్కుతుంది. ఇక గత ఎన్నికల్లో పోటీ చేసిన టిఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజలు అద్భుతమైన మెజారిటీ ని కట్టబెట్టిన విషయం తెలిసిందే. అయితే అక్కడినుండి రాష్ట్రాన్ని ఎప్పటికపుడు కష్టించి అభివృద్ధి చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు కేసీఆర్. ఇక ఈ సారి అనుకున్న సమయం కంటే కాస్త ముందుగా ఎన్నికలు రావడంతో ఈ సారి ఎవరు గెలుస్తారు అని అందరూ ఆశగా ఎదురుచూస్తున్నారు.
ఇకపోతే టిఆర్ఎస్ ప్రభుత్వానికి ఈ సారి ఎలాగైనా అధికారం రాకుండా చేయడానికి కాంగ్రెస్, టిడిపి, టిజెఎస్, సిపిఐ పార్టీలు జతకట్టి మహాకూటమిగా ఏర్పడ్డాయి. అయితే ఈ ఎన్నికల్లో కేసీఆర్ మళ్ళి సియం కావాలని, అలానే టిఆర్ఎస్ గెలవాలని ఒక వ్యక్తి నేటి ఉదయం ఏకంగా తన నాలుకను కోసుకుని సంచలనం సృష్టించాడు. కాగా నాలుక కోసుకున్న వ్యక్తి మాట్లాడుతూ, తన అభిమాన నాయకుడి కోసం తాను ఈ పనిచేసినట్లు ఆ కుర్రాడు చెబుతున్నాడు. నాలుక కోసిన అనంతరం ముడుపుగా దేవుడి హుండీలో వేశాడు. కాగా నాలుక కోసుకున్న యువకుడు ఏపీకి చెందిన వ్యక్తిగా స్థానికులు గుర్తించారు. హుటాహుటిన యువకుడ్ని స్థానికంగా ఉన్న తన్వీర్ ఆస్పత్రికి తరలించిన స్థానికులు వైద్యం అందిస్తున్నారు. హైదారాబాద్‌, శ్రీనగర్ కాలనీలోని వెంకటేశ్వర ఆలయం నందు ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే ఆ కుర్రాడు ఆంధ్ర ప్రాంత వ్యక్తి కావడం గమనార్హం. అయితే ఈ ఘటనకు సంబంధంచి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here