ఉద్యోగం లో తిరిగి చేరడానికి వెళ్లిన అభినందన్ కు షాకింగ్ న్యూస్ చెప్పిన అధికారులు ? Telugugaramchai

0
69

ఇటీవల జమ్మూ కాశ్మీర్ పుల్వామా లో  జరిగిన దాడి లో మన భారత జవాన్లు 42 మంది మరణించిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో మన భారతమాత ముద్దు బిడ్డ ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ మన శత్రు దేశమైన పాకిస్తాన్ సైన్యం కు యుద్ధ ఖైదీగా చిక్కాడు. పాకిస్తాన్ సైన్యం కు చిక్కిన అభినందన్ మూడు రోజుల పాటు శత్రు దేశం లో తన ధైర్య సాహసాలు ప్రదర్శించి తిరిగి  వాఘా సరిహద్దు వద్ద  భారత గడ్డ మీద అడుగు పెట్టాడు. వాఘా సరిహద్దు వద్ద భారత సైన్యం తో పాటు అనేక ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు అభినందన్ కు ఘన స్వాగతం పలికారు.

పాకిస్తాన్ సైన్యం చేతిలో మూడు రోజుల పాటు బందీ గా ఉన్న ఆయన ద్వారా జాతీయ భద్రత ,దేశ రహశ్యాలు బయటికి వెళ్లే అవకాశాలు  ఉన్న నేపథ్యంలో భారత సైన్యం అనేక రకాల పరీక్షలు నిర్వహించనుంది. పాక్ లో బందీ గా ఉన్న అభినందన్ నుంచి శత్రుదేశం రహస్యాలు ఏమైనా తెలుసుకుందా . అభినందన్ తనకు తెలియని పరిస్థితుల్లో దేశ రహస్యాలు ఏమైనా చెప్పేశారా . ఔషధాలు ప్రయోగించి దేశ రహస్యాలేమైనా రాబట్టారా .హింసించి జాతీయ భద్రతకు సంబందించినా సున్నిత విషయాలు తెలుసుకున్నారా . ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొనే ప్రతి భారత సైన్యాధికారికి పరీక్షలు తప్పవు అంటున్నారు అధికారులు.శత్రు దేశానికీ చిక్కి బయట పడ్డ అభినందన్ సాధారణ జీవితం గడపడానికి కొద్దిరోజులు పడుతుందని ఐ ఏ ఎఫ్ అధికారులు చెబుతున్నారు.  తిరిగి తన విధులు నిర్వర్తించడానికి వచ్చిన అభినందన్ కు పలు రకాల పరీక్షలు నిర్వహించి తన విధులు చేపట్టేలా చెప్పడం జరిగింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here