తన గెస్ట్ హౌస్ సీజ్ చేయడంపై హై కోర్ట్ ని ఆశ్రయించిన ప్రభాస్…..షాక్ లో టిఆర్ఎస్!

0
112
కొన్నాళ్ళనుండి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని అక్రమ నిర్మాణాలు మరియు వాటికి సంబందించిన ఫిర్యాదులపై ప్రభుత్వం కఠినంగా చర్యలు తీసుకుంది. ఇక అందిన ఫిర్యాదుల మేరకు అప్పట్లో కొన్ని అక్రమ నిర్మాణాలను కూల్చి వేసిన ప్రభుత్వం, ఇటీవల ఎన్నికల నేపథ్యంలో, ఆ హడావుడి మరియు ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో దానిపై కొద్దిరోజులపాటు మౌనం వహించింది. ఇక ఎట్టకేలకు అసెంబ్లీ కి ఎన్నికలు రావడం, ఇక ఈ ఎన్నికల్లో కూడా మరొక్కసారి టిఆర్ఎస్ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగిపోయాయి. అయితే మళ్ళి సీఎం గా ప్రమాణ స్వీకారం చేసిన కేసీఆర్, జిహెచ్ఎంసి పరిధిలోని అక్రమ నిర్మాణాలపై మరొక్కసారి గట్టిగా కొరడా ఝులిపించారు. ఇక శేరిలింగంపల్లి, నియోజకవర్గం పరిధిలోని రాయదుర్గం ప్రాంతంలో సర్వే నెంబర్ 46లో దాదాపుగా 80 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమిని కొందరు ప్రైవేట్ వ్యక్తులు స్వాధీన పరుచుకుని  వాటిలో ఆక్రమణ నిర్మాణాలు చేపట్టారు అని విరివిగా ఫిర్యాదులు రావడంతో నిన్న జిహెచ్ఎంసి అధికారులు అక్కడికి చేరుకొని వాటిని కూల్చేశారు.
అయితే ఆ సమయంలో అక్కడ సినిమా నటుడు ప్రభాస్ గెస్ట్ హౌస్ కూడా ఉండడం, ఆ హౌస్ కూడా అక్రమంగా కట్టిందని తమ వద్ద ఫిర్యాదు వుండడంతో, ఆ ఇంట్లో ఎవ్వరూ లేకపోవడంతో దానిని సీజ్ చేసి ప్రభుత్వ సీల్ వేయడం జరిగింది. ఇక విషయం ప్రభాస్ వరకు చేరడంతో, అప్పట్లో ఆ స్థలాన్ని కృష్ణ అనే వ్యక్తి నుండి తాము కొన్నామని, అయితే నేడు అధికారులు ఎటువంటి ముందస్తు హెచ్చరికలు జారీ చేయకుండా తమ ఇంటికి సీల్ వేయడం జరిగిందని ఈ విషయమై తన లాయర్ ద్వారా హై కోర్ట్ లో ఒక కేసు పెట్టారట ప్రభాస్. కాగా ఆ కేసు నేడు హియరింగ్ కు రానుందని, అంతేకాక ప్రభాస్ వద్ద పక్కాగా పత్రాలు ఉన్నాయని, కాబట్టి మరొక రెండు మూడు రోజుల్లో అయన గెస్ట్ హౌస్ అయన పరం అవుతుందని సమాచారం అందుతోంది. అయితే ప్రభాస్ తనకు న్యాయపరంగా వున్న హక్కును హరించినందుకే అయన ఇలా కోర్ట్ కు వెళ్లారని అయన సన్నిహితలు చెపుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here