జబర్డస్త్ రమేష్ రెండవ పెళ్లి…. షాక్ లో రోజా, నాగబాబు!

0
90
 జబర్దస్త్ ప్రోగ్రాం లో నటించిన కొందరు నటీనటులు  మరియు వారి వ్యక్తిగత జీవితాలను గురించి తెలిస్తే మాత్రం ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకంటే ఆ షోలో ప్రస్తుతం స్కిట్స్ చేస్తున్నవారిలో  ఎక్కువమంది  అట్టడుగు స్థాయినుండి వచ్చిన వారే అని చెప్పుకోవాలి. ఇక ఆ విధంగా కింద స్థాయినుండి పైకివచ్చి మంచి పేరు సంపాదించిన నటుల్లో జబర్దస్త్  పొట్టి రమేష్ ఒకడు. నిజానికి రమేష్ తన స్కిట్ లో పేల్చే పంచులు, చేసే కామెడీకి ఎంతటివారికైనా నవ్వు ఆగదు. అయితే నరేష్ కుటుంబం మొదట ఎన్నో కష్టాలు పడిందని, అయితే నరేష్ కు అనుకోకుండా జబర్దస్త్ లో అవకాశం రావడంతో వారి కుటుంబలో చాలావరకు సమస్యలు తీరాయని సమాచారం. ఇకపోతే రమేష్ కు ఇటీవల త్రిపురాంబిక అనే అమ్మాయితో వారి బంధువులు, మిత్రుల సమక్షంలో ఎంతో వైభవంగా పెళ్లి జరిగింది. అయితే పెళ్లి జరిగి ఎన్నోరోజులు కాకముందే, అయన భార్య త్రిపురాంబిక ఇటీవల ఆత్మహత్యాయత్నం చేసింది. కొద్దిరోజలుగా అత్తమామలు తనను విపరీతంగా వేధింపులకు గురిచేస్తున్నారని ఆమె అలా చేసినట్లు సమాచారం. ఇక ఇటీవల కొన్నాళ్ళనుండి భార్యాభర్తలిద్దరి మధ్య గొడవలు కూడా బాగా పెరగడంతో ఆవేదనతో త్రిపురాంబిక ఆత్మహత్యకు యత్నించిందని తెలుస్తోంది.
ఇకపోతే ఆ తరువాత రమేష్ ఆమెను ఇటీవల వదిలేసాడట. అంతేకాక ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం, రమేష్ మరొక అమ్మాయిని కొద్దిరోజుల క్రితం రెండవ వివాహం చేసుకున్నాడని అంటున్నారు. నిజానికి తన మొదటి భార్యకు విడాకులు ఇవ్వలేదని, అయినప్పటికీ కూడా రెండవ వివాహం మాత్రం చేసుకున్నాడని అంటున్నారు. నిజానికి మొదటి భార్య తనను పెట్టిన బాధలు అన్నీ ఇన్నీ కావని చెప్తున్న రమేష్, ఆమె పెట్టె బాధలు తట్టుకోలేకనే ఆమెను దూరంగా పెట్టానని, అందుకే ఇప్పుడు మరొక పెళ్లి చేసుకున్నానని అంటున్నారు. కాగా ప్రస్తుతం కొన్ని మీడియా వర్గాల్లో వైరల్ గా మారిన ఈ మ్యాటర్ పై పలువురు నెటిజన్లు, అయినా మొదటిభార్య కు విడాకులు ఇవ్వకుండా ఇలా రమేష్ రెండవ పెళ్లి చేసుకోవడం చట్టరీత్య నేరం అంటూ అతడిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here