కారు డ్రైవర్ తో లేచిపోయిన స్టార్ హీరోయిన్ కూతురు…..షాక్ లో టాలీవుడ్ పరిశ్రమ|telugugaramchai

0
65
టాలీవుడ్ హీరో, హీరోయిన్ లలో తమ ఇంట్లోని వారు చూసిన సంబంధాలను చేసుకుని బాగా సెటిల్ అయినవారు కొందరు అయితే, మరికొందరు ప్రేమ వివాహాలు చేసుకున్న వారున్నారు. ఇక తమ తల్లితండ్రులు చూసిన సింగపూర్ కు చెందిన దశరథరాజు అనే వ్యక్తిని వివాహం చేసుకున్న ఒకప్పటి సీనియర్ స్టార్ హీరోయిన్ కవిత, ఆ తరువాత సినిమాలకు దూరమయ్యారు. స్వతహాగా పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన కవిత, తరువాత ఆమె తల్లితండ్రులు వృత్తి రీత్యా చెన్నైలో సెటిల్ కావడంతో ఆమె బాల్యం మరియు కాలేజీ జీవితం అంతా అక్కడే సాగింది. అయితే ఆమె కాలేజీ చదువుతున్న సమయంలో తనను సినిమాల్లో చేరాలని ఆమె తండ్రి అడగడం, తరువాత ఒక సినిమా నిర్మాత ఆమె ఫోటోలను చూసి ఈ అమ్మాయిని మా సినిమాలో తీసుకుంటాం అని చెప్పడంతో, ఏ మాత్రం ఇష్టం లేకపోయినప్పటికీ కూడా అలా ఆమె సినిమాల్లోకి ప్రవేశించారు. ఆ విధంగా సిరిసిరి మువ్వ సినిమాతో టాలీవుడ్ లో అరంగేట్రం చేసారు కవిత.
అలా టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన కవిత మెల్లగా తెలుగు, తమిళ సినిమాల్లో నటించి నటిగా మంచి పేరు తెచ్చుకున్నారు. ఇక ఆమె ఇటీవల అక్కడక్కడా కొన్ని సినిమాల్లో కూడా చిన్నపాత్రల్లో నటించారు. అయితే చంద్రబాబు పాలన అంటే తనకు ఎంతో మక్కువ అని చెప్పే కవిత ,అయన మీద ఇష్టంతో టిడిపిలో చేరారు. అయితే పార్టీలో కొన్ని విబేధాల వల్ల ఎన్నాళ్ళో ఆ పార్టీలో ఉండని కవిత, తరువాత టీడీపీకి రాజీనామా చేసి, బిజెపిలో చేరారు. ఇక కవిత దంపతులకు ఒక కూతురు మాత్రమే వుంది. ఇక వారికీ ఒక్కగానొక్క కూతురు కావడంతో ఆమెను చిన్నప్పటినుండి ఎంతో అల్లారుముద్దుగా పెంచారు కవిత దంపతులు. అయితే ఇటీవల ఒకానొకరోజు హఠాత్తుగా ఆ అమ్మాయి తన కారు డ్రైవర్ ని పెళ్లి చేసుకుని మీడియా ముందుకువచ్చి అందరికి షాక్ ఇచ్చారు. నేను మనస్ఫూర్తిగా మా డ్రైవర్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను అని చెప్పిన కవిత గారి కూతరు, పోలీసులకు ఫిర్యాదు చేసి తమకు ప్రాణహాని ఉందని తల్లితండ్రులపై కేసు పెట్టింది.
అయితే వూహించనివిధంగా కొద్దిరోజులకు ప్లేట్ ఫిరాయించి, నిజానికి తనతో డ్రైవర్ కు వుంది కేవలం స్నేహం మాత్రమే అని, అతడు ఆరోజు తనకు కూల్ డ్రింక్ లో మత్తు మందు కలిపి ఇచ్చాడని, ఆ మైకంలో తనకు పెళ్లి జరిగి, మీడియా ముందుకు వచ్చిన విషయం కూడా తెలియదని అన్నారు. అయితే ఇందులో ట్విస్ట్ ఏమిటంటే, ఆమెను పెళ్లి చేసుకున్న ఆ డ్రైవర్ కు ఇదివరకే ఇద్దరు అమ్మాయిలతో వివాహం జరిగిందని, నా కూతురుని మోసం చేసి అతడు మూడవ వివాహం చేసుకున్నాడని కవిత అతడిని అరెస్ట్ చేయించారు. సో చూసారుగా ఫ్రెండ్స్, ఎంతటి వారైనా ముందు, వెనుక ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకుంటే పర్యవసానాలు ఇలానే ఉంటాయి అనడానికి కవిత కూతురు జీవితమే నిదర్శనం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here