సినీ నటి రమ్యకృష్ణ, తన జీవితంలో పడిన కష్టాలు తెలిస్తే కన్నీళ్లాగవు!

0
333

సినిమా నటీనటుల్లో దాదాపుగా ఎక్కువమంది ఆది నుండి ఎంతో కష్టపడి పైకి వచ్చిన వారే అని చెప్పాలి. నాటి ఎన్టీఆర్ నుండి నేటి నాని వరకు, అలానే అప్పటి సావిత్రి నుండి ఇప్పటి సాయి పల్లవి వరకు ఎందరో నటీనటులు తమ కెరీర్ లో కష్టాలు ఎదుర్కొని ముందుకి సాగినవారే అని చెప్పాలి. ఇక ఆ విధంగా అప్పట్లో హీరోయిన్ గా తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో తనకంటూ కొంత ప్రత్యేక ఇమేజి తెచ్చుకుని, ఇటీవల దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమాలోని శివగామి పాత్ర ద్వారా ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసిన నటి, రమ్యకృష్ణ. అయితే కొన్నేళ్ల క్రితం దర్శకుడు కృష్ణవంశీని ప్రేమించి వివాహం చేసుకున్న రమ్య, తన సినిమా జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కున్న విషయం చాలామందికి తెలియదు. నిజానికి ఆమె సినిమా కెరీర్ 14ఏళ్ల వయసులోనే ప్రారంభమయిందట.

Image result for ramya krishna

ఇక తొలినాళ్లలో మూతల్ వసంతం అనే తమిళ సినిమా షూటింగ్ కోసం
వేసిన సెట్లో కాలుపెట్టిన రమ్య గారు, షూటింగ్ స్పాట్ లో 15 అడుగుల లోతులో కింద పడిపోయారట. అయితే ఆమెకు గాయాలయ్యాయని విషయం తెలుసుకున్న ఆ సినిమా హీరో అరుణ్ పాండ్యన్, ఆమెను వెంటనే రక్షించి సమీప ఆసుపత్రికి తరలించారట. ఇక ఆ ప్రమాదం కారణంగా  రమ్యకృష్ణ కుడికాలి మడిమకు చాలా పెద్ద గాయం అయిందని, అంతేకాక అది తగ్గడానికి ఆమె కాలుకి మూడు ఆపరేషన్లు కూడా జరిగాయని సమాచారం. ఇక ఆమె కాలుకి గాయం అవడంతో సినిమా ఆపేయాలని భావించిన విర్మాతలు ఆమెకు ఇచ్చిన రెమ్యూనిరేషన్ తిరిగి తీసుకున్నారట. అయినప్పటికీ ఆమె మొక్కవోని ఆత్మవిశ్వాసంతో ఆ సినిమాతో పాటు తెలుగులో సంకీర్తన అనే సినిమా షూటింగ్ కూడా విజయవంతంగా  పూర్తి చేశారట. కాగా అప్పటి ఘటనను ఇటీవల రమ్య ఒక ఇంటర్వ్యూ ద్వారా గుర్తుచేసుకున్నారు…….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here