ఒకప్పుడు మెగాస్టార్ పక్కన నటించిన హీరోయిన్ ఇప్పుడు ఎన్ని వేలకోట్లు సంపాదించిందో తెలుసా!

0
182
సినిమా ఇండస్ట్రీలో కొందరు నటీనటులు సినిమాల్లో నటించేటప్పుడు వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుని మంచి క్రేజ్ తో దూసుకెళ్లి దానితోపాటు బాగా డబ్బు సంపాదించిన వారు ఎక్కువగా కనపడుతుంటారు. ఇక ఆ తరువాత తమ కెరీర్ కొంత ముందుకు సాగాక, ఆపై పెళ్లి చేసుకుని వెళ్లిపోయి తమ కుటుంబ జీవితాన్ని చక్కగా సరిద్దికున్నవారున్నారు. అటువంటి వారిలో అలా తనకు నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకుని ప్రస్తుతం వేలకోట్ల ఆస్తులు సంపాదించిన ఒకప్పటి నటి మాధవి. నిజానికి మాధవి అచ్చమైన తెలుగు అమ్మాయి. హైదరాబాద్ లో శశిరేఖ, గోవింద స్వామి దంపతులకు 1962లో జన్మించిన మాధవి, చిన్నప్పటినుండి నాట్యం అంటే ఎంతో మక్కువతో భరతనాట్యం నేర్చుకున్నారు. అయితే పదమూడేళ్ల వయసులో ఆమె ఇచ్చిన డాన్స్ ప్రోగ్రాం ని చూసిన దర్శకరత్న దాసరి నారాయణ రావు గారు, ఆమెను తాను తీసిన తూర్పుపడమర సినిమాలో తీసుకున్నారు.
అలా సినీ రంగంలోకి వచ్చిన మాధవి, ఆతరువాత పిచ్చి పంతులు, వారాలబ్బాయి వంటి సినిమాలతో మంచి పేరు సంపాదించారు. ఆ తరువాత మాధవి మెగాస్టార్ చిరంజీవి సరసన చాలా సినిమాల్లో నటించింది. ఒకానొక సమయంలో వారిద్దరిని మంచి హిట్ పెయిర్ అని కూడా అనేవారు. ఇక వారిద్దరూ కలిసి నటించిన సినిమాల్లో ఖైదీ, ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య, దొంగమొగుడు, చట్టానికి కళ్ళు లేవు, కుక్కకాటుకు చెప్పు దెబ్బ, కోతలరాయుడు వంటి హిట్ సినిమాలు వున్నాయి. ఇకపోతే కొన్నాళ్ళు సినిమాల్లో నటించిన తరువాత తనకు నచ్చిన రాల్ఫ్ శర్మను వివాహం చేసుకున్న మాధవి, విదేశాలకు వెళ్లిపోయారు. అయితే కొన్నేళ్ళనుండి మీడియాకు కనపడని మాధవి, ఇటీవల మళ్ళి మీడియా ముందుకు వచ్చారు.
అయితే తాను సినిమాలు మానేశాక తన భర్తతో సహా విదేశాలకు వెళ్లిపోయామని, అక్కడినుండి ఫ్యామిలీ ని చూసుకోవడానికి తాను ప్రాధాన్యత ఇచ్చినట్లు చెప్పారు మాధవి. అంతేకాక ఆ భగవంతుడి దయవల్ల తన భర్త పెట్టిన వ్యాపారాలు బాగా వృద్ధి చెందడంతో వారికీ వేలకోట్ల రూపాయల ఆస్థి కూడా కలిసి వచ్చింది. ఇక ప్రస్తుతం మాధవి దంపతులకు దాదాపుగా పదివేల కోట్లరూపాయలకు పైగా ఆస్తివున్నట్లు కొందరు సినీ విశ్లేషకులు చెపుతున్నారు. ఇక మాధవి దంపతులకు ముగ్గురు కుమార్తెలు, వారిలో పెద్ద కుమార్తె టిఫాని శర్మను త్వరలో సినిమాల్లోకి తీసుకువచ్చే ఆలోచన మాధవికి ఉందని చెపుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here