టాప్ హీరో కూతుర్ని పెళ్లి చేసుకోబోతున్న అడివి శేష్…ఎవరో తెలిస్తే షాక్ అవుతారు!

0
97
క్షణం సినిమాలో నటనతో పాటు, రైటర్ గా కూడా వ్యవహరించిన అడివి శేష్ ఆ సినిమా అద్భుత విజయంతో తెలుగు ప్రేక్షకుల్లో మంచి పేరు సంపాదించాడు. ఇక ఇటీవల అయన నుండి వచ్చిన గూఢచారి సినిమా శేష్ కు మరింత గొప్ప పేరుని తీసుకువచ్చింది. వాస్తవానికి తన సినిమాలకు స్క్రీన్ ప్లే మరియు కథ విషయంలో తనవంతుగా జాగ్రత్త వహించే శేష్, త్వరలో గూఢచారి సినిమాకు సీక్వెల్ లో నటించనున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించి నిన్న సోషల్ మీడియా వేదికల్లో అయన పుట్టిన రోజును పురస్కరించుకుని ఒక పోస్టర్ ని రిలీజ్ చేయడం జరిగింది. కాగా ఈ సినిమాని 2019జూన్ లో షూటింగ్ ప్రారంభించి 2020జనవరిలో విడుదల చేయనున్నట్లు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న  రాహుల్ పాకాల తెలిపారు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా యాంగ్రీ యంగ్ మాన్ గా పేరుగాంచిన సీనియర్ నటుడు రాజశేఖర్ పెద్ద కుమార్తె శివాని తీసుకునే ఆలోచనలో సినిమా యూనిట్ ఉన్నట్లు సమాచారం అందుతోంది.
అయితే ఈ సినిమాకు శివానిని తీసుకోవడం వెనుక అసలు మ్యాటర్ వేరేవుందని అంటున్నాయి కొన్ని టాలీవుడ్ వర్గాలు. ఇక అసలు మ్యాటర్ ఏంటంటే, కొన్నాళ్ళనుండి శేష్ కు మరియు శివానికి మంచి పరిచయం ఉందని, అయితే ఆ పరిచయం మెల్లగా ప్రేమగా మారిందని అంటున్నారు. అందువల్లనే ఆమెను గూఢచారి2 లో కూడా తీసుకోవాలని అనుకుంటున్నారట. అంతేకాదు ఇక ఈ సినిమా విడుదల తరువాత వారిద్దరూ పెళ్లి కూడా చేసుకోబోతున్నారని, ఈ మేరకు ఇరు కుటుంబాల నుండి గ్రీన్ సిగ్నల్ కూడా వచ్చిందని సమాచారం. అయితే ఈ విషయమై రెండు కుటుంబాలవారు ఏ మాత్రం విషయం బయటకు పొక్కకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నారని, కానీ కొందరు మీడియావారు మాత్రం విషయాన్ని పసిగట్టి తమ మీడియా మాధ్యమాల ద్వారా బయటపెట్టినట్లు తెలుస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here